లండన్ మ్యూజియంలో వుంచిన వాగ్దేవి (సరస్వతి) విగ్రహాన్ని తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభిస్తుందన్నారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. బ్రిటన్ ప్రధాన మంత్రిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టిన తర్వత ఈ ప్రకటన రావడం గమనార్హం.
వాగ్దేవి విగ్రహాన్ని భారతదేశానికి తిరిగి తీసుకురావాలని హిందూ సమాజం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.ధార్‌లోని భోజ్‌శాల కాంప్లెక్స్‌ను భారత పురావస్తు శాఖ పర్యవేక్షిస్తోంది.
ఇది వాగ్దేవి (సరస్వతి) ఆలయానికి, కమల్ మౌలా మసీదులకు నిలయం.క్రీస్తుశకం 1034లో రాజా భోజ్ ఈ పురాతన నగరంలో వాగ్దేవి విగ్రహాన్ని ప్రతిష్టించాడని చరిత్రకారుల అభిప్రాయం.
బ్రిటీష్ వారు 1875లో భారతదేశాన్ని పరిపాలించిన సమయంలో ఈ విగ్రహాన్ని లండన్‌కు తరలించారని.ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని మ్యూజియంలో వాగ్దేవి విగ్రహం వుందని హిందూ సంస్థలు చెబుతున్నాయి.శనివారం ఇండోర్‌లో జరిగిన యంగ్ థింకర్స్ కాన్‌క్లేవ్ ప్రారంభోత్సవంలో సీఎం చౌహాన్ మాట్లాడుతూ.వాగ్దేవి విగ్రహాన్ని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి చొరవ తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం , ప్రపంచవ్యాప్తంగా వున్న ఇతర సంఘర్షణలను ప్రస్తావిస్తూ ప్రపంచశాంతికి మార్గం ‘‘వసుదైవ కుటుంబం’’ అనే భావనను భారతదేశం ఎప్పుడో చెప్పిందన్నారు.అయితే.భోజశాల విషయంలో వివాదం వుంది.ఇది వాగ్దేవి (సరస్వతి) ఆలయమని హిందువులు చెబుతుండగా.కాదు , కాదు కమల్ మౌలా మసీదని ముస్లింలు వాదిస్తున్నారు.ఈ క్రమంలో ప్రతి మంగళవారం భోజ్‌శాలలో హిందువులు ప్రార్ధనలు చేసుకోవడానికి, శుక్రవారం ముస్లింలు నమాజు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.