ఎమ్ ఎస్ ధోని మూవీ రివ్యూ

చిత్రం : ఎమ్ ఎస్ ధోని – ది అంటోల్డ్ స్టోరి

 Ms Dhoni Movie Review-TeluguStop.com

బ్యానర్ : ఫాక్స్ స్టార్ స్టూడియో

దర్శకత్వం : నీరజ్ పాండే

నిర్మాతలు : అరుణ్ పాండే, ఫాక్స్ స్టార్

సంగీతం : అమాల్ మలిక్, రోచక్ కొహ్లీ

విడుదల తేది : సెప్టెంబరు 30, 2016

నటీనటులు : సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అనుపమ్ ఖేర్, భూమిక, కియారా అద్వాని, దిశా పటాని

చాలా తక్కువ సమయంలోనే బాలివుడ్ లో అగ్ర దర్శకుడిగా ఎదిగిపోయారు నీరజ్ పాండే.ఇటు విమర్శకుల ప్రశంసలు, అటు బాక్సాఫీస్ కలెక్షన్లు, రెండూ అవలీలగా సంపాదించే నీరజ్ పాండే, భారతీయ క్రికేట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోని జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు అనగానే సర్వత్రా ఆసక్తి మొదలైంది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కఠోర శ్రమతో అచ్చుగుద్దినట్లు ధోని లాగా ఆడటం నేర్చుకోని మరి ఈ సినిమాలో నటించాడు.దేశవ్యాప్తంగా కొట్లమంది ఎదురుచూసిన ఎమ్ ఎస్ ధోని – ది అంటోల్డ్ స్టోరి మరి క్రికేట్ అభిమానుల్ని మెప్పిస్తుందా లేదా ఇప్పుడు చూద్దాం

కథలోకి వెళ్తే …

రాంచీ లాంటి చిన్న పట్టణంలో పుట్టిన మహేంద్ర సింగ్ ధోని (సుశాంత్ సింగ్ రాజ్ పుత్) ఫుట్ బాల్ లో గోల్ కీపింగ్ బాగా చేస్తాడు.

కాని ఓ కోచ్ సూచనతో క్రికేట్ గోల్ కీపర్ గా మారి, క్రికేట్ ని సీరియస్ గా తీసుకుంటాడు.కొడుకు భవిష్యత్తు మీద పాన్ సింగ్ (అనుపమ్ ఖేర్) బెంగ పెట్టుకుంటాడు.

చదువుకోని ఉద్యోగం చేసుకోవాల్సింది పోయి, ఈ క్రికేట్ పిచ్చి ఏంటని ఆయన భావం.తండ్రి మాటను పూర్తిగా కాదనలేక ధోని ఖరాగ్ పూర్ రైల్వే స్టేషన్ లో టిటిఈ ఉద్యోగం సంపాదించి, ఇటు ఉద్యోగంతో పాటు, క్రికేట్ సాధన చేస్తుంటాడు.

కాని తోటివారు కెరీర్లో దూసుకుపోతోంటే ధోని మాత్రం రెల్వే స్టేషన్ లో ఉండిపోతాడు.ఒకానోక సమయంలో ఇక క్రికేట్ మాత్రమే తన జీవితం అని భావించిన ధోని, ఖరాగ్ పూర్ రైల్వే స్టేషన్ నుంచి, వాంఖడే మైదానంలో ప్రపంచకప్ అందుకునే దాకా ఎలాంటి ప్రయాణం చేసాడు అనేది తెర మీద చూడాల్సిందే

నటీనటుల నటన గురించి :

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని హిట్ చిత్రాలు ఇచ్చినా, ఈ సినిమాలో తన అభినయం గురించి బ్రతికనంత కాలం తను, భారతీయ సినిమా బ్రతికినంత కాలం ప్రేక్షకులు మాట్లాడుకుంటునే ఉంటారు.ధోని లాగా కనబడటం కష్టమైన విషయం కాదేమో కాని, ధోని లాగా నడవటం, ధోని లాగే ఆడటం, ముఖ్యంగా ధోని లాగే హెలికాప్టర్ షాట్ ఆడటం మామూలు విషయం కాదు.పేజిలు పేజిల కొద్ది సుశాంత్ ని పొగుడుకుంటూ రాయొచ్చు.

ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఇదే బెస్ట్ పెర్ఫర్మెన్స్

అనుపమ్ ఖేర్ లాంటి నటుడి గురించి కొత్తగా చెప్పాల్సిన పనేం ఉంటుంది.ప్రతీ నీరజ్ పాండే సినిమాలో కనిపించే అయన, ప్రతీసారి కొత్త పాత్రలో, కొత్త నటనావిధానంతో కనిపిస్తున్నారు.

ఈసారి అంతే.ధోని తండ్రి పాత్రలో ఆయన చక్కగా సరిపోయారు.

మన తెలుగువారికి బాగా పరిచయమున్న భూమిక చాలాకాలం తరువాత వెండితెరమీద కనిపించడమే కాదు, మెప్పించింది.ధోని మాజీ ప్రేయసిగా దిశా పటాని, ధోని భార్యగా కియార అద్వాని బాగున్నారు.
సాంకేతికవర్గం పనితీరు :

నీరజ్ పాండే తరువాత ఈ సినిమాకి మరో ఆఫ్ స్క్రీన్ హీరో ఎవరు అంటే అది కెమెరామెన్ సంతోష్ తుండియిల్.ఒక్క సన్నివేశంలో కూడా మరక అంటించలేని విజువల్స్ అందించారు ఆయన.ఇక ఎడిటింగ్ డిపార్టుమెంటు హెడ్ అయిన నారాయణ్ సింగ్ మీద కొన్ని కంప్లయింట్స్ రావడం ఖాయం.ఎందుంటే ఈ సినిమా నిడివి మూడు గంటలు దాటింది.

క్రికేట్ ప్రేమికులకి, ధోని అభిమానులకి ఫర్వాలేదు కాని, సామన్య ప్రేక్షకుడు అంతసేపు కూర్చోవడం ఎంతవరకు సాధ్యమో మేకర్స్ తోపాటు ఎడిటర్ కూడా ఆలోచించి ఉంటే బాగుండేదేమో.ఈ సినిమాకి ఎడిటింగ్ ప్రధాన మైనస్ పాయింట్.
నీరజ్ పాండే సంభాషణలు, నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలు, అన్ని బాగున్నాయి

విశ్లేషణ :

నీరజ్ పాండే ఇంతకుముందు దర్శకత్వం వహించిన సినిమాలన్ని థ్రిల్లర్ జానర్ సినిమాలే.తనకు అలవాటైన జానర్ నుంచి తొలిసారి బయటకి వచ్చిన నీరజ్, ఈసారి పూర్తిగా సఫలం కాలేదనే చెప్పాలి.

అలాగని విఫలం కాలేదు.ఎడిటింగ్ మీద సరైన శ్రద్ధ పెట్టకపోవడంతో కొన్ని చోట్ల డ్రాగ్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది.

మరో విషయం ఏంటంటే, ధోని జీవితాన్ని పూర్తిగా కవర్ చేయలేదు ఈ సినిమా.కొన్ని రహస్యాలు ఇంకా రహస్యాలుగానే మిగిలిపోయాయి.

ఈ విషయం మీద చాలామంది నిరాశ చెందవచ్చు

యువరాజ్ సింగ్ ఎపిసోడ్లు, వాంఖడే ఎపిసోడ్ .అబ్బో చెప్పుకుంటే పోతే ఒకటి రెండు కాదు, బోలేడు సన్నివేశాలు క్రికేట్ ప్రేమికుల్ని తమ జ్ఞాపకాలు నెమరువేసుకునేలా చేస్తాయి.రోమాలు నిక్కబొడుచుకుంటాయి, చప్పట్లు, విజిల్స్ పడతాయి … ధోని పడిన కష్టాలు, సెలెక్టర్లకు ఎదురువెళ్ళి తీసుకున్న నిర్ణయాలు, విషాదాన్ని మిగిల్చిన అతని ప్రేమకథ .ఇది కేవలం సినిమా కాదు, కొట్లమంది భావోద్వేగం.కాని సినిమాని సినిమాలాగే చూసి చెప్పాలంటే, కొన్ని లూప్ హోల్స్ ఉన్నా, ఓ వెండితెర అద్భుతం.ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కూడా ధోని మార్క్ సిక్సర్లు కొట్టడం ఖాయం

హైలైట్స్ :

* సుశాంత్ సింగ్ రాజ్ పుత్

* బయటి ప్రపంచానికి తెలియని క్రికేట్ దిగ్గజాల రహస్యాలు

* వాంఖడే ఎపిసోడ్

* ధోని ప్రేమకథ

* క్రికెట్ ప్రేమికులని ఉర్రూతలూగించే సన్నివేశాలు, జ్ఞాపకాలు

డ్రా బ్యాక్స్ :

* అక్కడక్కడ నెమ్మదించే నరేషన్

* ఎడిటింగ్, నిడివి

చివరగా :

మీరే గనుక క్రికేట్ అభిమానైతే, అస్సలు మిస్ చేసుకోకండి

తెలుగుస్టాప్ రేటింగ్ : 3/5

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube