చాలా రోజులుగా టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు అనే తీవ్రమైన చర్చ సాగుతోంది.నిన్న మొన్నటి వరకు లైన్లో ఉన్న శ్రీలీల ఇక తన సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉండడంతో ఆమె చేతిలో ప్రస్తుతం కొత్త సినిమాలేమి లేవు.
అందుకే నంబర్ వన్ రేస్ నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.సీనియర్ హీరోయిన్స్ అంతా కూడా తమవల్ల కాదు బాబు అంటూ పక్కకు తప్పుకున్నారు.
అయితే ఒకే ఒక్క హీరోయిన్ ప్రస్తుతం ఆ రేస్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ తాను ఉన్నాను అంటూ ముందుకు దూసుకు వస్తోంది.ఆ హీరోయిన్ మరెవరో కాదు మృనాల్ ఠాకూర్( Mrunal Thakur ).ఇప్పటి వరకు కేవలం మిడ్ రేంజ్ హీరోలతోనే అమ్మడు నటించింది.కానీ ఇక తనకు ఆ అవసరం లేదు అంటుంది.
ఇప్పటి వరకు ఒక లెక్క … ఇకపై మరో లెక్క అంటుంది ఈ సీతారామం బ్యూటీ.మొదట దుల్కర్ సల్మాన్ సరసన సీతారామం ( Sita Ramam )చిత్రంలో నటించి సెన్సేషనల్ టాలీవుడ్ ఎంట్రీ చేసేసింది.ఆ తర్వాత హాయ్ నాన్న అంటూ నాని సరసన చెట్ట పట్టాలు వేసుకొని బాగానే సై అంది.ఈ రెండు సినిమాలు విజయం సాధించాయి.అందుకే ఈ వరుసలో హ్యాట్రిక్ విజయం కోసం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యింది.అయితే వరుస విజయాలు అందుకుంటున్న మృణాల్ కి తెలుగు తో పాటు హిందీలో కూడా భారీగానే ఆఫర్స్ వస్తున్నాయి.
గతంలో అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ సరసన నటించిన మృనాల్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) సరసన నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది.గతంలో తనకు బ్రహ్మాండమైన విజయాన్ని అందించిన సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి తన తదుపరి సినిమాలో మరోసారి మృణాల్ కి అవకాశం ఇచ్చాడు.ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంలో మృణాల్ నే హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టు సమాచారం.ఈ సినిమా కనక హిట్ అయితే మృణాల్ రేంజ్ మరో రేంజ్ కి వెళ్లడం ఖాయం.