మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.సీతారామం ( Sitaramam ) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైనటువంటి ఈ మరాఠీ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించిన ఈమెకు ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.ఈ సినిమా తర్వాత నానితో కలిసి హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ అందుకున్నారు.
ఇక త్వరలోనే విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తో కలిసి నటించిన ఫ్యామిలీ స్టార్ ( Family Star ) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మృణాల్ తన ఫేవరెట్ కో స్టార్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్న.మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు అని అడిగితే చెప్పడం కాస్త కష్టమే కానీ నేను దుల్కర్ సల్మాన్ ( Dulquer Salman ) అని చెబుతాను అంటూ తెలిపారు.
ఎప్పటికీ నా ఫేవరెట్ కో స్టార్ దుల్కర్ అంటూ ఈమె కామెంట్ చేశారు.ఎందుకంటే సీతారామం వంటి ఒక అద్భుతమైనటువంటి సినిమాలో నేను చేసినటువంటి పాత్ర కాస్త కష్ట తరంగానే ఉంటుంది.అలాంటి సమయంలో దుల్కర్ నన్ను అడుగడుగునా ప్రోత్సహిస్తూ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు.
కేవలం దుల్కర్ కారణంగానే నేను ఆ పాత్ర చేయగలిగానని తెలిపారు.ఇక ప్రస్తుతం ఇన్ని భాషలలో సినిమాలు చేస్తున్నాను అంటే నాకు దుల్కర్ సల్మాన్ స్ఫూర్తి అంటూ ఈ సందర్భంగా తన ఫేవరెట్ కో స్టార్ అయినటువంటి దుల్కర్ సల్మాన్ గురించి మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.