బాలీవుడ్ లో ఎట్టకేలకు హిట్ కొట్టనున్న మృణాల్ ఠాకూర్..?

బాలీవుడ్ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) "సీతా రామం"( Sita Ramam ) సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

ఈ ముద్దుగుమ్మ మొదట హిందీ సీరియళ్లతో తన కెరీర్ ప్రారంభించింది.

కుంకుమ్ భాగ్య (2014–2016) సీరియల్‌తో మంచి గుర్తింపు దక్కించుకుంది.ఈ తార టీవీ సీరియళ్లలో నటిస్తూనే 2014లో విడుదలైన మరాఠీ చిత్రం "విట్టి దండు"తో సినీ రంగ ప్రవేశం చేసింది.అదే సంవత్సరం మరో రెండు మరాఠీ సినిమాలు కూడా చేసింది.2018లో లవ్ సోనియా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.2019లో విడుదలైన బయోపిక్స్‌ సూపర్ 30, బాట్లా హౌస్‌ల్లో కూడా ఈ బ్యూటీ నటించింది.అవి హిట్స్ కావడంతో కొద్దో గొప్పో గుర్తింపు లభించింది.

ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్‌లో ( Bollywood ) వరుసగా ఫ్లాప్స్ ఎదురయ్యాయి.ఇక ఆమె కెరీర్ క్లోజ్ అనుకుంటున్న సమయంలో హను రాఘవపూడి "సీతారామం"లో హీరోయిన్‌గా నటించే అవకాశమిచ్చాడు.

అది హిట్ కావడంతో మృణాల్ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

Advertisement

ఇందులో యువరాణి నూర్జహాన్, సీతా మహాలక్ష్మిగా మృణాల్ నటించి మెప్పించింది.ఆమె అందాలకు, ట్రెడిషనల్ లుక్స్‌కి అందరూ ఫిదా అయిపోయారు.దీని తర్వాత హాయ్ నాన్న,( Hi Nanna ) ఫ్యామిలీ స్టార్( Family Star ) వంటి సినిమాల్లో హీరోయిన్‌గా చేసే అవకాశాలు వచ్చాయి.

వీటి ద్వారా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింత పెరిగిపోయింది.బాలీవుడ్‌లో కూడా ఆమెకు మెరుగైన అవకాశాలు వస్తున్నాయి.ఇంతకుముందు చిన్న సినిమాల్లోనే అవకాశాలు వచ్చాయి.

ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటించే ఛాన్సెస్ ఆమెకు వస్తున్నాయి.బాలీవుడ్‌లో సక్సెస్ కావాలనే తన కోరిక త్వరలోనే నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం మృణాల్ పూజా మేరీ జాన్, హై జవానీ తో ఇష్క్ హోనా హై, సన్నాఫ్ సర్దార్ 2 వంటి హిందీ సినిమాల్లో నటిస్తోంది.సన్నాఫ్ సర్దార్-2( Son Of Sardaar-2 ) మూవీ ఆమెకు కచ్చితంగా ఒక హిట్ తెచ్చి పెట్టవచ్చు.ఈ మూవీ ఫస్ట్ పార్ట్ "మర్యాద రామన్న"కి హిందీ రీమేక్.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

హిందీ రీమేక్ చాలా పెద్ద హిట్ అయింది.ఈ యాక్షన్ కామెడీ మూవీకి రూ.30 కోట్లు పెడితే రూ.161 కోట్లు వచ్చాయి.ఇప్పుడు దానికి సీక్వల్‌గా వస్తున్న సినిమాలో మృణాల్‌ హీరోయిన్‌గా, అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్నాడు.

Advertisement

ఈ మూవీ షూటింగ్ నిన్ననే ప్రారంభమైంది.ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేశారు.

ఇందులో మృణాల్‌ డోలు పట్టుకొని ఒక ఫెస్టివల్‌లో సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు కనిపించింది.మరి ఆమెకు ఈ సినిమా అయినా బాలీవుడ్‌లో సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.

తాజా వార్తలు