విజయవాడ ఎంపీ కేశినేని నాని పై టీడీపీ నేత బుద్దా వెంకన్న( TDP Leader Buddha Venkanna ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేశినేని నాని అప్పుల అప్పారావు అని విమర్శించారు.
టీడీపీలో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని కేశినేని నాని కొందరి దగ్గర అప్పులు చేశారని ఆరోపించారు. కేశినేని నాని( MP Keshineni Nani )కి అప్పు ఇవ్వడమంటే గోడకు కొట్టిన సున్నం లాంటిదేనని ఎద్దేవా చేశారు.
మైలవరం వైసీపీ ఇంఛార్జ్ గా ఉండి కూడా డబ్బులు కొట్టేసి ఉంటారని విమర్శలు చేశారు.ప్రస్తుతం కేశినేని నాని వెనుక టీడీపీ( TDP ) నేతలే కాదు.
ఆయన కుటుంబం కూడా లేదన్నారు.ఈ క్రమంలో కేశినేని నానికి వైసీపీ టికెట్ ఇవ్వడం కూడా డౌటేనని తెలిపారు.







