Tomato Crop : టమాటో పంటకు తీవ్ర నష్టం కలిగించే బూడిద తెగులు నివారించే పద్దతులు..!

టమాటో పంట( Tomato crop )కు తీవ్ర నష్టం కలిగించే బూడిద తెగులు శిలీంద్ర బీజాంశాల వల్ల పంటను ఆశిస్తుంది.ఈ శిలీంద్రాలు ఆకు మొగ్గలు మరియు మొక్కల అవశేషాలలో జీవించి ఉంటాయి.

 Methods To Prevent Gray Rot Which Causes Severe Damage To Tomato Crop-TeluguStop.com

గాలి, నీరు, ఈ బీజాలకు దగ్గరగా ఉన్న మొక్కల ద్వారా వ్యాప్తి చెందుతాయి.ఈ బూడిద తెగులకు కారణం అయ్యే శిలీంద్రం 10 నుండి 12° ఉష్ణోగ్రతల్లో జీవిస్తుంది.

కొద్దిపాటి వర్షపాతం లేదంటే పొగ మంచు ఉండే సమయంలో ఈ బూడిద తెగులు వ్యాప్తి చెందుతాయి.

Telugu Agriculture, Farmers, Gray Rot, Neem Oil, Organic Method, Photosynthesis,

బూడిద తెగులను ఎలా గుర్తించాలంటే.టమాటో మొక్క ఆకులు, కాండం, పండ్లపై గుండ్రటి పౌడర్ లాంటి తెల్లని మచ్చలు ఏర్పడతాయి.కొన్నిసార్లు ఈ మచ్చలు ఆకుల కింది భాగంపై కూడా ఏర్పడతాయి.

ఈ తెగుల వల్ల మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ( Photosynthesis ) సక్రమంగా జరగదు.దీంతో ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి.

కొన్ని ఆకులు వంకర్లు తిరగడం, విచ్చిన్నం చెంది రూపం కోల్పోవడం జరుగుతుంది.మొక్కలు మరియు ఎదుగుతున్న చిగుర్ల రూపురేఖలు కూడా మారిపోతాయి.

Telugu Agriculture, Farmers, Gray Rot, Neem Oil, Organic Method, Photosynthesis,

మరి ఈ బూడిద తెగులు పంటను ఆశించకుండా ఉండాలంటే.తెగులు నిరోధక, తెగులను తట్టుకునే మేలు రకం విత్తనాలను( Seeds ) సాగుకు ఎంపిక చేసుకోవాలి.మొక్కలకు మంచి ప్రసరణ ఉండేలా మొక్కల మధ్య అధిక దూరం ఉండేటట్లు నాటుకోవాలి.ఈ తెగులు కనిపించిన వెంటనే ఆ మొక్క ఆకులను తుంచేయాలి.పంట కోతల అనంతరం పొలాన్ని లోతు దుక్కులు దున్ని, పంట అవశేషాలను పూర్తిగా పొలం నుండి తొలగించాలి.ఈ తెగుళ్లను గుర్తించిన తర్వాత ముందుగా సేంద్రీయ పద్ధతి( Organic method )లో తెగుళ్లను నివారించే ప్రయత్నం చేయాలి.

గంధకం, వేప నూనె, ఆస్కార్బిక్ యాసిడ్ లను మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.ఒకవేళ ఈ బూడిద తెగుళ్ల తీవ్రత అధికంగా ఉంటే, అప్పుడు పిచికారి మందులైన హెక్సాకోనజోల్ట్ ట్రైఫ్లుమిజోల్, మైక్లోబ్యూటనిల్ ఆధారిత శిలీంద్ర నాశినులను రెండు మిల్లీలీటర్లను ఒక లీటరు నీటిలో కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube