తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.శుక్రవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో నంద్యాల ఎంపీ కాసు బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి సిద్దారాఘవరావులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.







