టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.చంద్రబాబు బస్సు యాత్ర మొదలుపెట్టి ప్రస్తుతం జైలు యాత్ర చేస్తున్నారని విమర్శించారు.
అదేవిధంగా లోకేశ్, పవన్ కల్యాణ్ యాత్రలపై ఎంపీ గోరంట్ల సెటైర్లు వేశారు.లోకేశ్ పాదయాత్ర మొదలుపెట్టి ఢిల్లీ యాత్ర చేస్తున్నారన్నారు.
అటు జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టి పారిపోయే యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు.అయితే ఎవరెన్ని యాత్రలు చేసినా సీఎం జగన్ జైత్రయాత్ర ఆపలేరని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ఏపీలో మరోసారి జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.







