కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు పిటిషన్ పై వాదనలను రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు వింటామని ధర్మాసనం పేర్కొంది.అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అవినాశ్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు విచారించింది.
ఈ నేపథ్యంలో తనను కూడా అరెస్ట్ చేస్తారేమోననే ఆందోళనతో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ముందస్తు బెయిల్ పై హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.