ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ వాయిదా

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.

ఈ మేరకు పిటిషన్ పై వాదనలను రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు వింటామని ధర్మాసనం పేర్కొంది.

అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అవినాశ్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు విచారించింది.

ఈ నేపథ్యంలో తనను కూడా అరెస్ట్ చేస్తారేమోననే ఆందోళనతో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ముందస్తు బెయిల్ పై హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఆ సినిమా నాకు పెద్ద గుణపాఠం నేర్పింది… దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు ?