ఈ మాటలు అన్నది ఏ చోటా మోటా లీడర్ కాదు.ఆయనో ఎంపీ.
కేసీఆర్ కూతురు కవితపై గెలిచిన ఎంపీ.ఆయన పేరు ధర్మపురి అరవింద్.
నిజామాబాద్ ఎంపీ.పౌరసత్వ సవరణ చట్టంపై ఆయన స్పందిస్తూ.
కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ముస్లింల ఓట్ల కోసం చట్టాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.

కేసీఆర్ ఓ గడ్డం లేని ముల్లా అని అన్నారు.హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గడ్డం తీసి కేసీఆర్‌కు అతికిస్తానని, అసద్‌ను నిజామాబాద్‌లో క్రేన్‌కు వేలాడదీస్తానని అరవింద్ అనడం గమనార్హం.నిజామాబాద్ గడ్డ.బీజేపీ అడ్డా అని ఆయన నినదించారు.నీ సొంత ఇలాకాలో నీ తమ్ముడిని కత్తులతో పొడిస్తే కాపాడలేని వ్యక్తి.బీజేపీని ఏదో చేస్తాడంట అని అసదుద్దీన్‌పై మండిపడ్డారు.