భారత మార్కెట్లో రూ.15వేల బడ్జెట్లో మోటో జీ64 5జీ స్మార్ట్ ఫోన్( Moto G64 5G ) లాంఛ్ అయింది.ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ వివరాల గురించి తెలుసుకుందాం.
మోటో జీ64 5జీ స్మార్ట్ ఫోన్:
ఈ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ ప్లే తో వస్తోంది.ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ ( Android 14 )సిస్టం పై పనిచేస్తుంది.120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్, యాస్పెక్ట్ రేషియో 20:9 గా ఉంది.మీడియా టెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ పై మోటో జీ64 5జీ రన్ అవుతుంది.
12GB RAM+256 GB స్టోరేజ్ తో ఉండే ఈ ఫోన్ స్టోరేజ్ ను మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు.ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరాతో పాటు, ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో ఉంటుంది.వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా తో ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ 5జీ, 4జీ LTE, వైఫై, బ్లూటూత్ V5.3, NFC, GPS, USB టైప్-C పోర్టు లాంటి కనెక్టివిటీ ఫీచర్లతో ఉంటుంది.IP52 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ తో ఉంటుంది.6000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 33W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.8GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది.12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16999 గా ఉంది.ఈ ఫోన్ మింట్ గ్రీన్, పెరల్ బ్లూ, ఐస్ లిలాక్ కలర్లలో అందుబాటులో ఉంది.
మోటోరోలా( Motorola ) అధికారిక వెబ్సైట్, ఫ్లిప్ కార్ట్ లలో అందుబాటులో ఉంది.HDFC క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపు పొందవచ్చు.