అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది.మాభున్ని అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.
ఆమెను చంపేయడమే కాకుండా ఆమె కుమార్తెపై లైంగిక దాడి చేశాడు.జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామానికి చెందిన మాభున్ని(40)కి ఇంటర్, పదో తరగతి చదివే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మాభున్నితో వివాహేతర సంబంధం పెట్టుకున్న రామకృష్ణ అనే వ్యక్తి.ఆమెను ఆమె ఇద్దరి కుమార్తెలను పోషించేవాడు.
ఈ క్రమంలోనే ఇంటర్ చదువుతోన్న మాభున్ని పెద్దకూతురిపై రామకృష్ణకు దురాలోచన పుట్టింది.మాభున్నిని కొద్ది రోజుల క్రితం హతమార్చి, అనంతరం ఆమె ఇద్దరి పిల్లలను తీసుకొని మకాం మార్చేశాడు.
అక్కడి హిందూపురంలోని ఓ లాడ్జిలో మాభున్ని పెద్ద కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు లాడ్జిపై దాడిచేసి రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.
పదో తరగతి చదువుతోన్న మాభున్ని రెండో కూతురు కనిపించడంలేదు.దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.







