నాలుగేళ్ల క్రితం చనిపోయిన పాపను కలుసుకున్న తల్లి... ఎలా అంటే..?

సాధారణంగా మనకు తెలిసిన వారు ఏ కారణంతోనైనా మరణిస్తేనే ఎంతో బాధ పడతాం.

అలాంటిది ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న పేగు చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం.

రోజులు గడుస్తున్నా మనసు పొరల్లో ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది.అలా మన జీవితంలోనుండి శాశ్వతంగా దూరమైపోయిన వారిని ఒకసారి కలిస్తే అవకాశం వస్తే ఎలా ఉంటుంది.? నిజ జీవితంలో అలా కలుసుకోవటం అసాధ్యమే అయినప్పటికీ ఒక కొరియన్ టీవీ ఛానల్ మూడేళ్ల క్రితం చనిపోయిన పాపను తిరిగి కలుసుకునేలా చేసింది.ఒక కొరియన్ టీవీ ఛానల్ గత కొన్ని నెలల నుండి మీటింగ్ యూ అనే పేరుతో ఒక షోను నిర్వహిస్తోంది.

ఈ షో ద్వారా జాంగ్ జీ సంగ్ అనే తల్లికి నాలుగేళ్ల క్రితం చనిపోయిన తన కూతురును కలుసుకొని, కూతురుతో మాట్లాడే అవకాశం కల్పించింది.షోలో జాంగ్ జీ సంగ్ మైదానంలోకి వెళ్లగానే ఏడేళ్ల తన కూతురు తన ముందుకు రావడంతో సంతోషంతో ఆ తల్లి " ఓ మై ప్రెటీ ఐ మిస్డ్ యూ" అంటూ ప్రేమగా పలకరించింది.

కూతురు తన తల్లితో " అసలు నేను నీకు గుర్తున్నానా.? ఇంతకాలం ఎక్కడికెళ్లిపోయావు.?" అని అమాయకపు చూపులతో ప్రశ్నించడం "నిన్ను ఎలా మరిచిపోతాను కన్నా" అని తల్లి బదులివ్వడం అక్కడ ఆ షోను చూస్తున్న వారందరికీ కంటతడి పెట్టించింది.కొరియన్ టీవీ వర్చువల్ రియాలిటీ అనే టెక్నాలజీని ఉపయోగించి పాపను కలుసుకునేలా చేసింది.

Advertisement

డిజిటల్ కెమెరా ముఖానికి డిజిటల్ గ్లోవ్స్ తగిలించడం ద్వారా జాంగ్ జీ సింగ్ తన కూతురును నిజంగా కలుసుకున్న అనుభూతిని పొందింది.తన కూతురును కలిసేలా చేసిన కొరియన్ టీవీకి జాంగ్ కృతజ్ఞతలు చెప్పుకుంది.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు