అయోధ్యలో మసీదు పేరు ఏంటో తెలుసా?

దశాబ్దాల పాటు వివాదాస్పదంగా మారి కోర్టులలో నలుగుతూ వచ్చిన రామజన్మభూమి కేసు సుప్రీంకోర్టు తీర్పుతో ఓ కొలిక్కి వచ్చింది.దశాబ్దాలపాటు భారతీయులు ఎదురు చూసిన రామమందిరం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ దొరికింది.

 Mosque In Ayodhya To Be Named 'dhannipur Masjid', Ayodhya, Rammandir, Dhannipur-TeluguStop.com

మందిర నిర్మాణానికి క్లియరెన్స్ రావడంతో ఇప్పుడు అక్కడ మందిర నిర్మాణం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గతంలో అక్కడ ఉన్న బాబ్రీ మసీద్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇండో- ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ (ఐఐసీఎఫ్‌) కు భూమిని కేటాయించింది.

ఈ మసీద్ కు పెట్టబోయే పేరు కోసం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరిగింది.ఇక తాజాగా ఈ మసీద్ పేరు ఫైనల్ అయ్యిందని సమాచారం.మరి ఇంతకీ ఈ మసీద్ కు ఏ పేరు పెట్టబోతున్నారో ఇప్పుడు చూద్దాం.

కోర్టు ఆదేశాల మేర ధన్నిపూర్‌ గ్రామ ప్రాంతంలో మసీదుకు స్థలం కేటాయించారు.

అందువల్ల అక్కడ నిర్మించబోయే మసీద్ కు ‘ధన్నిపూర్ మసీదు’ అనే పేరు పెట్టాలని ఐఐసీఎఫ్‌ నిర్ణయించిందని సమాచారం.ప్రస్తుతం ధన్నిపూర్‌ గ్రామ ప్రాంతంలో నిర్మించబోతున్న మసీద్ కు ఐఐసీఎఫ్‌ ట్రస్ట్ విరాళాలను సేకరిస్తుందని ట్రస్ట్ సభ్యులలో ఒకరు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube