రిపబ్లిక్ డే రిలీజ్.. గుడ్డిగా విడుదల చేస్తే వసూళ్ల పరిస్థితి ఏంటీ?

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.ఈ సమయంలో దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది.

ఉత్తర భారతంలో అధికారికంగా కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.ఏపీలో నేటి నుండి కర్ఫ్యూ అమలు కాబోతుంది.

కనుక ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియడం లేదు.రాబోయే నెల రోజుల పాటు పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ సమయంలో ఏ ఒక్కరు కూడా తమ పనులు పెట్టుకోవద్దని కొందరు సూచిస్తుంటే సినిమా ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రం తమ సినిమాను రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు.సంక్రాంతికి విడుదల అయిన సినిమాలే తల కిందులు అయ్యాయి.

Advertisement

ఇప్పటి వరకు వసూళ్లు ఏమాత్రం దక్కించుకోలేక పోతున్నాయి.ఒక్క బంగార్రాజు మినహా సంక్రాంతికి విడుదల అయిన సినిమాలు ఏ ఒక్కటి కూడా ఆకట్టుకోలేక పోయాయి.

పెద్ద ఎత్తున సినిమాలు వచ్చినా కూడా పెద్దగా వసూళ్లు దక్కించుకోలేక పోయాయి.అయినా కూడా ఈ రిపబ్లిక్ డే కు సినిమా ను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు.

తెలుగు సినిమాలు డీజే టిల్లు తో పాటు పలు సినిమాలు విడుదల కాబోతున్నాయి.ఇవే కాకుండా మరి కొన్ని సినిమాలు కూడా రిపబ్లిక్ డే కు రాబోతున్నాయి.

ఇక తమిళ డబ్బింగ్ మూవీ సామాన్యుడు సినిమాను కూడా విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నారు.పెద్ద ఎత్తున రిపబ్లిక్ డేకు సినిమాలు వస్తున్నాయి సరే మరి ఇంత గుడ్డిగా విడుదల చేస్తే వసూళ్లు నమోదు అయ్యేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిస్థితుల్లో సినిమాల విడుదల 99 శాతం రిస్క్ తో కూడుకున్నది.1 శాతం మాత్రమే సక్సెస్ కు అవకాశం ఉంది.కనుక ఈ సినిమాల పరిస్థితి ఏంటో చూడాలి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు