US Cruise Ship : యూఎస్‌: వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థత గురైన క్రూయిజ్ షిప్ ప్రయాణికులు?

యూఎస్‌లోని ఒక క్రూయిజ్ షిప్‌( Cruise Ship )లో ఊహించని పెద్ద సమస్య ఒకటి చోటు చేసుకుంది.

ఈ ఓడలో ఉన్న చాలా మంది ఒకేసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

వారు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో చాలా ఇబ్బంది పడిపోయారు.అందరికీ ఒకేసారి ఇలా అవ్వడంతో ప్రయాణికులలో చాలా ఆందోళన కలిగింది.

ఇలా జరగడానికి కారణం ఏంటనేది అమెరికా ఆరోగ్య అధికారులకు కూడా ఇంకా తెలియ రాలేదు.వారు బుధవారం వార్నింగ్ ఇచ్చారు.

ఆ క్రూయిజ్ షిప్‌ పేరు క్వీన్ విక్టోరియా( Queen Victoria Cruise ship ). ఇది జనవరి 22న ఫ్లోరిడా నుండి బయలుదేరింది.ఓడలో 1,824 మంది ప్రయాణికులు, 967 మంది సిబ్బంది ఉన్నారు.

Advertisement

అయితే 123 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు.అంటే 6.74% ప్రయాణికులు, 1.65% సిబ్బందికి అనారోగ్యం కలిగింది.ఇదేమైనా అంటు వ్యాధి హా అనే కోణంలోనూ ఆందోళనలు మొదలయ్యాయి.

వ్యాధి వ్యాప్తి చెందకుండా షిప్ కంపెనీ ప్రయత్నిస్తోంది.ఇప్పటికే కంపెనీ అనారోగ్యంతో ఉన్నవారిని ఇతరుల నుంచి వేరు చేసింది.

ఓడను శుభ్రపరిచి, క్రిమిసంహారక మందులు కూడా వాడేసింది.మరోవైపు అమెరికా ఆరోగ్య అధికారులు( America Health Officials ) పరిస్థితిని గమనిస్తున్నారు.

అనారోగ్యం అందరినీ ఒకే సమయంలో ప్రభావితం చేయకపోవచ్చు.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

కొంతమందికి తర్వాత అనారోగ్యం రావచ్చు లేదా త్వరగా కోలుకోవచ్చు.ఈ నౌక 16 రాత్రుల పాటు ప్రయాణిస్తుంది.ఇది ఫిబ్రవరి 7న శాన్ ఫ్రాన్సిస్కో, ఫిబ్రవరి 12 న హోనోలులును సందర్శిస్తుంది.

Advertisement

ఫ్లోరిడాలోని క్రూయిజ్ షిప్‌లో ఈ సమస్య రావడం ఇదే మొదటిసారి కాదు.కొన్ని వారాల క్రితం, మరొక నౌకలో ప్రయాణించే వారికి ఇలాంటి అనారోగ్యం వచ్చింది.

ఆ ఓడలోని కొంతమందికి నీలిరంగు వాంతి వచ్చింది.విషప్రయోగం అని వారు భావించారు.

అయితే దీనికి కారణం ఇంకా తెలియరాలేదు.

తాజా వార్తలు