తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ప్రియాంక గాంధీతో చర్చించినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.ప్రతి పది రోజులకు ఒకసారి ప్రియాంక గాంధీ తెలంగాణకు రావాలని కోరానని తెలిపారు.
33 జిల్లాలు కవర్ చేయాలని కోరినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.ఈ మేరకు జూలై 7 తరువాత సమయం కేటాయిస్తామని ప్రియాంక చెప్పారన్నారు.
తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారని, నేతలందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్నారని తెలిపారు.తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు రావాలన్న ఆయన పార్టీ గెలుపునకు తమ ప్రయత్నం చేస్తామని చెప్పారు.
పార్టీలో ఎవరిని జాయిన్ చేసుకోవాలన్నది అధిష్టానందే నిర్ణయమని స్పష్టం చేశారు.