పెళ్లంటే పార్టీలు చేసుకోవడం కాదు... ఒక పెద్ద బాధ్యత... తమన్నా కామెంట్స్ వైరల్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో బిజీగా మారిపోయారు నటి తమన్నా( Tamannah ).ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ( Vijay Varma ) తో ప్రేమలో ఉన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Marriage Is Not About Parties A Big Responsibility , Tamannah, Vijay Varma ,lust-TeluguStop.com

గత కొంతకాలంగా వీరిద్దరూ జంటగా కలిసి కనిపించడంతో వీరిద్దరి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.అయితే ఎట్టకేలకు ఈ వార్తలపై స్పందించిన తమన్నా తనతో రిలేషన్ లో ఉన్నానని చెప్పేశారు.

ఇక ఈమె నటించిన లస్ట్ స్టోరీ2 ( Lust Story 2 ) ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి తమన్న తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Telugu Bollywood, Lust Story, Tamannah, Tollywood, Vijay Varma, Web-Movie

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తమన్నా ఎన్నో విషయాల గురించి మాట్లాడారు.ముఖ్యంగా ప్రేమ పెళ్లి స్నేహం వంటి వాటి గురించి తమన్న చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే పెళ్లి విషయంలో ఏదైనా ఒత్తిడికి గురవుతున్నారా అన్న ప్రశ్న ఈమెకు ఎదురవడంతో ఈ ప్రశ్నకు ఈమె తన స్టైల్ లో సమాధానం చెప్పారు.

ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన బాధ్యత అని తెలియజేశారు.మనకు నచ్చినప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడం కాదు.

ఆ బాధ్యతను మోయడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని, అప్పుడే వివాహ బంధంలోకి అడుగు పెట్టాలని తమన్న చూసించారు.

Telugu Bollywood, Lust Story, Tamannah, Tollywood, Vijay Varma, Web-Movie

పెళ్లి అంటే కేవలం పార్టీలు చేసుకోవడం మాత్రమే కాదు అదొక పెద్ద బాధ్యత.పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలు కలిసి ఉండాలి అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని తమన్న సూచించారు.తాను ఇండస్ట్రీలోకి వచ్చిన 10 సంవత్సరాల పాటు చాలా బిజీగా ఉంటానని భావించాను 30 సంవత్సరాల కు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని ప్రణాళిక వేసుకున్నాను అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయని,పక్కవారి ఆలోచనలకు ప్రభావితం కాకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను అంటూ ఈ సందర్భంగా పెళ్లి గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube