దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే లక్ష్యంతో కేంద్రం , ఆర్బీఐ అమల్లోకి తీసుకొచ్చిన మారటోరియంను ఇక పై పొడిగింపు ఇవ్వడం కుదరదు అని స్పష్టం చేసాయి.రుణ మారటోరియం కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కేంద్రం, ఆర్ బీఐ ఈ అంశం పై స్పష్టతనిచ్చాయి.
ఆరు నెలలకు మించి ఉపశమనం ఇవ్వడం సాధ్యం కాదని ఆర్బీఐ తాజా అఫిడవిట్ లో క్లారిటీ ఇచ్చింది.కరోనా వైరస్ సంక్రమణ, లాక్ డౌన్ నేపధ్యంలో ఎక్కడికక్కడ జనజీవనం స్థంబించింది.
ఈ నేపధ్యంలో రుణ గ్రహీతలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ మారటోరియం విధించింది.అయితే ఈ మారటోరియంను మరోసారి పొడిగించాలనే విషయంపై గత కొన్ని రోజులుగా చర్చ సాగుతుంది.
మారటోరియం కాలంలో 2 కోట్ల వరకూ ఉన్న రుణాలపై వడ్డీని వదులుకోవడంపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన అఫిడవిట్ సంతృప్తికరంగా లేదని సుప్రీంకోర్టు తెలిపింది.ఈ విషయంలో క్రెడాయ్ వంటి సంఘాల వాదన పరిశీలించాలని కోర్టు అభిప్రాయపడింది.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం , ఆర్బీఐ మారటోరియంపై స్పష్టత ఇచ్చాయి.సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించాయి.