చంద్రబాబును ఏపీకి రానివ్వరట

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఉండి ప్రభుత్వంపై విమర్శలు చేయడంను మోపిదేవి వెంకటరమణ తీవ్రంగా కొట్టిపారేశారు.

అసలు చంద్రబాబు నాయుడు ఈ సమయంలో మాట్లేడే అర్హత కూడా లేదంటూ ఆయన అన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు నాయుడు ఏపీకి రావాలంటే ఖచ్చితంగా 14 రోజుల పాటు ప్రభుత్వం నిర్వహించే క్వారెంటైన్‌లో ఉండాల్సిందిగా ఆయన అన్నాడు.హైదరాబాద్‌ నుండి వస్తున్న వారిని క్వారెంటైన్‌లో ఉంచుతున్నట్లుగానే ఆయన్ను కూడా ఉంచుతామన్నారు.

ఏపీలో ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో ఆయన అక్కడ నుండి రాజకీయాలు నడిపించడం విడ్డూరంగా ఉందన్నాడు.నిమ్మగడ్డను తొలగించడంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపై మోపిదేవి తీవ్రంగా స్పందించారు.

చంద్రబాబు డైరెక్షన్‌లో నడిచే నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అన్ని విధాలుగా రూల్స్‌ ప్రకారమే తప్పించడం జరిగిందని అన్నారు.కొన్ని సందర్బాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.

Advertisement

ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంకు మంచి నిర్ణయాలు ఇచ్చి పాలనలో సహకరించాల్సింది పోయి ప్రతి పనిలో ప్రభుత్వంకు అడ్డు పడటం సరైన విధానం కాదంటూ మోపిదేవి అన్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

Advertisement

తాజా వార్తలు