జీవో నంబరు 217కు, సముద్రంలో చేపల వేటకు వెళ్ళే మత్స్యకారులకు ఎటువంటి సబంధం లేదన్న విషయం కూడా తెలియని అజ్ఞాని పవన్ కల్యాణ్ ఆ జీవోను చింపేశానంటాడు.217 జీవో వల్ల మత్స్యకారులకు మరింత లాభం, ఎందుకంటే, ఇంతకుముందు ఇన్ ల్యాండ్ వాటర్ బాడీస్ లో మత్స్యకారుల పేరు చెప్పి అధికార పార్టీ దోపిడీ చేసేది.వారికి ఏ రూపాయీ దక్కేది కాదు.
ఇప్పుడు అలా కాదు.ఈ జీవో ద్వారా ప్రయోజనాలు మత్స్యకారులకే నేరుగా దక్కుతాయి.పవన్ కల్యాణ్ సభకు వచ్చిన వారు సినిమా అభిమానులే తప్ప, వారంతా మత్స్యకారులు కాదువారు మత్స్యకారులే అయి ఉంటే, సముద్రంలో చేపల వేటకు, 217 జీవోకు సంబంధం లేదని ఏ ఒక్కరైనా పవన్ కల్యాణ్ కు చెప్పేవారు.
అదికూడా జరగలేదు.అంటే, జీవో సంగతి తెలియని పవన్ కల్యాణ్ తన రిలీజ్ కాబోతున్న సినిమా కోసం సందడి చేసేందుకు నరసాపురం సభను వాడుకున్నాడని అందరికీ అర్థమవుతుంది.
కాబట్టి, ఇది ఓ సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్ ఫంక్షన్.మత్స్యకారులకు, దీనికి ఏ సంబంధమూ లేదు.
జీవో నంబరు 217 వల్ల లాభమే కానీ, నష్టం లేదు.
విడుదల కాబోయే తన సినిమాకు ప్రమోష్ ఫంక్షన్ లా పవన్ సభ నిర్వహణ మత్స్యకారుల నోటి కాడ తిండిని పెట్టు బడిదారులు, దళారులు కొట్టేసి ఏడాదికి రూ.300, 1000 చేతిలో పెట్టేవారు.బహిరంగ వేలం ద్వారా మత్స్యకార సొసైటీ ప్రతి సభ్యుడికి రూ.15 వేలు వరకు ఆదాయం రావాలని ఈ విధానాన్ని తెచ్చాం.217 జీవో ప్రకారం నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద కేవలం 27 రిజర్వాయర్లపై పబ్లిక్ ఆక్షన్ కు వెళ్ళాం.
మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 217 తెస్తే.దానిని ఎందుకు తప్పు పడుతున్నారో, దానివల్ల మత్స్యకారులకు జరిగే నష్టం ఏమిటో చెప్పాలి.దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు.మత్స్యకారుడికి నిర్ణీత ఆదాయం రావాలనే జీవో 217 తెచ్చాం.
కోవిడ్‌లోనూ ఆక్వా రంగం నిలబడిందంటే సీఎం జగన్ ఇచ్చిన చేయూత, భరోసా వల్లే.