అఖండ2 సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ పక్కా.. అలా ఎంట్రీ ఇస్తే ఫ్యాన్స్ కు పూనకాలే!

బాలయ్య( Balayya ) బోయపాటి శ్రీను( Boyapati Srinu ) కాంబినేషన్ అంటే మాస్, క్లాస్ ప్రేక్షకులను మెప్పించే కాంబినేషన్ అని ఫ్యాన్స్ ఫీలవుతారు.

ఈ కాంబినేషన్ లో అఖండ సీక్వెల్ అఖండ 2( Akhanda 2 ) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.అయితే అఖండ2 సినిమాలో మోక్షజ్ఞ( Mokshagna ) ఎంట్రీ పక్కా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండగా ఆ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

అఖండ సీక్వెల్ లో సెకండాఫ్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.పవర్ ఫుల్ రోల్ తో అఖండ సీక్వెల్ లో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అఖండ2 సినిమా మోక్షజ్ఞ కెరీర్ కు సైతం ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

అయితే మోక్షజ్ఞ ఈ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు.మోక్షజ్ఞ నిజంగానే ఈ ప్రాజెక్ట్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.మోక్షజ్ఞ కచ్చితంగా స్టార్ హీరో అవుతారని అతని లుక్స్ చూస్తే ఈ నమ్మకం కలుగుతోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

మోక్షజ్ఞ ప్రస్తుతం ఉన్న లుక్ ను మెయింటైన్ చేస్తే కెరీర్ పరంగా తిరుగుండదు.మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) దర్శకత్వంలో తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో సైతం నిజానిజాలు తెలియాల్సి ఉంది.నందమూరి మోక్షజ్ఞ ఇప్పటికే యాక్టింగ్ లో సైతం శిక్షణ తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మోక్షజ్ఞ కెరీర్ పరంగా సత్తా చాటాలని అభిమానులు ఫీలవుతూ ఉండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు