కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి మొట్ట మొదటి సారిగా కలిసి నటిస్తున్న "అగ్ని నక్షత్రం" టైటిల్ లాంచ్

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం “అగ్ని నక్షత్రం”.

 Mohan Babu, Manchu Lakshmi's First Collaboration Titled Agni Nakshatram, Mohan B-TeluguStop.com

విలక్షణ నటుడు సముద్రఖని, మలయాళీ నటుడు సిద్ధిక్, విశ్వంత్ , జబర్దస్త్ మహేష్ నటీ నటులుగా ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు మరియు లక్ష్మీ ప్రసన్న లు నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం ఈరోజు ఉదయం 9:29 గంటలకు ఘనంగా జరిగింది.

తండ్రీ కూతుళ్ళైన కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి మొట్ట మొదటిది సారిగా కలిసి నటించడం విశేషం.మంచి ముహూర్తాన “అగ్ని నక్షత్రం” అనే టైటిల్ రివీల్ చేయడం జరిగింది.ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు కథ అందించారు.ఇప్పుడు రిలీజ్ అయిన లుక్స్ చూస్తుంటే ఇదొక పోలీస్ స్టోరీ వంటి విభిన్నమైన కథాంశంతో రూపొందింది అని అర్థం అవుతుంది.ఇందులో విలక్షణ నటుడు సముద్రఖని, మలయాళం లో ఎన్నో విభిన్న పాత్రలు పోశించిన మలయాళ నటుడు సిద్దిక్ విలన్ గా చైత్ర శుక్ల ద్వితీయ ముఖ్య పాత్రలో, విశ్వంత్ కథా నాయకుడిగా, జబర్దస్త్ మహేష్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తుండగా, మధురెడ్డి ఎడిటర్ గా లిజో కె జోస్ సంగీతం, గోకుల్ భారతి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు.

శర వేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది.

నటీ నటులు కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, మంచు లక్ష్మి, సముద్రఖని, మలయాళీ నటుడు సిద్ధిక్, విశ్వంత్ , జబర్దస్త్ మహేష్, చైత్ర శుక్ల తదితరులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube