జనగామ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ లో నేతల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా టికెట్ విషయంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య వార్ కూడా నడుస్తోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఎమ్మెల్సీ పల్లాపై ముత్తిరెడ్డి మరోసారి ధ్వజమెత్తారు.నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించానన్న ముత్తిరెడ్డి జనగామను అభివృద్ధి పథంలో నడిపానని చెప్పారు.
అయితే తన నియోజకవర్గాన్ని కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.పల్లా రాజేశ్వర్ రెడ్డి తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడిన ఆయన ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు.
నియోజకవర్గ ప్రజలను పల్లా ఎప్పుడైనా ఆదుకున్నారా అని ప్రశ్నించారు.