Mlc palla rajeshwar reddy : రెచ్చగొట్టి రాళ్లు, కర్రలతో దాడి.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!!

శాంతియుతంగా ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై బీజేపీ ముఖ్య నేతలు దాడులకు ఉసిగొల్పుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు.అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఈటల రాజేందర్, మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విర్రవీగుతున్నారని ఆరోపించారు.

 Mlc Palla Rajeshwar Reddys Sensational Comments Mlc Palla Rajeshwar Reddy, Trs,-TeluguStop.com

పలివెలతో తనతోపాటు కార్యకర్తలపై దాడులు చేయించారు.అబద్ధాలతో విష ప్రచారం చేశారని పేర్కొన్నారు.

నల్గొండ జిల్లా కనగల్ మండలం జీ యడవల్లిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.

‘పలివెలలో ఇప్పర్తి, కిష్టాపురం గ్రామస్తులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించాము.అప్పుడు బీజేపీ గుండాలు తమపై రాళ్ల దాడి చేశారు.

ఇందుకు ప్రేరేపించిన ఈటల రాజేందర్‌పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి.ఎన్నికల్లో గెలిచెందుకు తమపై అబద్ధాలు చెబుతూ విష ప్రయోగం చేస్తున్నారు.

పలివెలలో టీఆర్ఎస్‌కు వస్తున్న ఆదరణను చూసి భయపడుతున్నారు.ఈటల సతీమణి బ్యూటీషియన్లతో మహిళల చేతులపై కమలం పువ్వు గుర్తులను వేస్తున్నారు.

ఇది వాస్తవం కాదా?.పలివెల ఘటనలో టీఆర్ఎస్ నాయకుల చేతుల్లో కట్టెలు కనిపించాయా? బీజేపీ గుండాల చేతుల్లో కట్టెలు కనిపించాయా? దానికి సంబంధించిన విజువల్స్ చూస్తే తెలుస్తుంది.టీఆర్ఎస్ నాయకుల చేతిలో కర్రలు ఉన్నట్లు ప్రూప్ చూపిస్తే రాజకీయాల నుంచి తప్పించుకుంటా.’ అని బీజేపీకి సవాల్ విసిరారు.

Telugu Cm Kcr, Etala Rajender, Manu Godu, Mlcpalla, Raidis-Political

బీజేపీ నేత క్షమాపణ చెప్పాలి.అబద్ధాలను చెప్పి ప్రజలను మభ్యపెట్టిన ఈటల రాజేందర్ తన అత్తగారి ఊరి ప్రజలకు క్షమాపణ చెప్పాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.డబ్బులు ఉన్నాయన అహంకారంతో కేసీఆర్, కేటీఆర్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడారు.పలివెల ఘటనలో టీఆర్ఎస్ కార్యకర్తలు జగదీశ్, భవనం శ్రీనివాస్ రెడ్డి, సురేశ్ ఇలా మరో 8 మంది గాయపడ్డారు.

ఇందులో ఒక్క బీజేపీ నేతకు కూడా గాయాలు అయ్యాయా అని ప్రశ్నించారు.టీఆర్ఎస్ నేతలు దాడి చేస్తే.దానికి సంబంధించి విజువల్స్ ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube