సభా మర్యాదను మంటగోలుపుతున్న నాయకుల ప్రవర్తన

అసెంబ్లీ( Assembly ) అన్నది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది అని పెద్దలు చెప్పే మాట.ఇక్కడ ప్రజా సమస్యలపై చర్చ జరుపుతూ వాటికి అర్థవంతమైన పరిష్కారాలు చూపించే వేదిక ఇది.

 Mlas Fight In Ap Assembly , Ap Assembly , Assembly,telangana Assembly , Leaders-TeluguStop.com

ఇక్కడ ఒక్కరోజు సభ నడపడానికి అయ్యే ఖర్చు అక్షరాలా 58 లక్షల రూపాయలు .మరి అంత విలువైన ప్రజాధనాన్ని, సమయాన్ని వృధా చేస్తూ ఈరోజు పార్టీలు చేస్తున్న దిగజారుడు క రాజకీయాలను చూస్తుంటే ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో అపహస్యమైందో అర్థమవుతుంది.అసభ్య పదజాలాలు, బెదిరింపులతో సభా మర్యాదలు మంటగలుపుతూ నాయకుల ప్రవర్తిస్తున్న తీరు సామాన్య ప్రజలలో రాజకీయ లపై వెగటు కలుగుతుంది .

పొరుగున ఉన్న తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న విధానాన్ని చూసుకొనైనా ఆంధ్ర నాయకులు తమ ప్రవర్తనను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది ఉద్వేగాలు, ఉద్రిక్తతల.విమర్శలు ప్రతి విమర్శలు అక్కడ కూడా ఉంటున్నాయి .కానీ ప్రజలు తమను గమనిస్తున్నారని ఎరుక కూడా అక్కడ నాయకులకు ఉంది అందుకే తమ ప్రవర్తన హద్దు మీరకుండా వాళ్ళు చూసుకుంటున్నారు.అలాంటి కనీస జాగ్రత్తలు కూడా ఆంధ్ర నాయకులు ( Leaders of Andhra )తీసుకున్నట్టుగా లేదు .ఇప్పటివరకు తిట్టుకోవడంతోనే సరిపెట్టిన నాయకులు ఈరోజు కొట్టుకోవడం మొదలుపెట్టారు .

Telugu Ap Assembly, Assembly, Jive Canceled, Andhra, Podium, Sudhakar Babu-Telug

జీవో నెంబర్ 1 రద్దు విషయమై టిడిపి చేసిన ఆందోళన పరస్పరం దాడి కి దిగే స్థాయికి దిగజారింది ….జీవో ఒకటి రద్దు విషయమై వాయిదా తీర్మానం కోసం పట్టుబడుతూ స్పీకర్ పోడియాన్ని తెలుగుదేశం నాయకులు చుట్టుముట్టారు ఈ సమయంలో వైసీపీ నాయకులు కూడా స్పీకర్ పోడియం( Speaker podium ) పైకి దూసుకొచ్చారు ఈ సమయంలోనే తమపై దాడి జరిగిందనితెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు తమ పార్టీ నాయకుడు బాల వీరాంజనేయ స్వామి పై వైసీపీ నాయకుడు సుధాకర్ బాబు దాడి చేశారని, తమ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పై కూడా దాడి జరిగిందంటూ తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు …

Telugu Ap Assembly, Assembly, Jive Canceled, Andhra, Podium, Sudhakar Babu-Telug

అయితే స్పీకర్ పై చేయి వేసినందు వల్లే విడదీయడానికి వెళ్ళాం తప్ప దాడి చేయడానికి కాదంటూ వైసీపీ నాయకులు తమ వెర్షన్ వినిపిస్తున్నారు … అయితే ఈ మొత్తం సంఘటనలో నష్టపోయింది ఎవరు అంటే సాధారణ ప్రజలే.నిత్యజీవితంలో తాము ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించాల్సిన దేవాలయం లాంటి అసెంబ్లీలో తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొట్టుకుంటున్న నాయకులను చూస్తే ఏమనాలో కూడా ప్రజలకు అర్థం కావడం లేదు కనీసం పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రంలో జరుగుతున్న సభ ని ఆదర్శంగా తీసుకొని ఇప్పటికైనా ప్రజా సమస్యలపై జరిగే విధంగా చర్యలు తీసుకోవాలంటూ సామాన్య ప్రజలు కోరుతున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube