గవర్నర్ ప్రభుత్వం మధ్య వివాదంలో ప్రభుత్వానిది పై చేయి అయ్యిందా?

తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళ సై( Tamilisai Soundararajan ) కి గత కొంత కాలం గా మంచి సంబందాలు లేవు .ప్రబుత్వం పై ఇప్పటికే అనేక సారు విమర్శలు చేసిన గవర్నర్ పై బారాసా నాయకులు కూడా ప్రతి విమర్శలు చేశారు ఇప్పుడు ఈ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే.

 Kcr Get Upperhand About Governor Issue On Supremcourt? Tamilisai Soundararajan ,-TeluguStop.com

తాము ఆమోదించిన బిల్లులను గవర్నర్ కావాలనే తొక్కి పెడుతున్నారని, ఆ బిల్లులకున్న ప్రాధాన్యత దృష్ట్యా మంత్రులు వెళ్లి అనుమానాలు నివృత్తి చేసిన తర్వాత కూడా ఈ బిల్లులు ఇంకా గవర్నర్ అనుమతి పొందలేదని ఇది రాజ్యాంగ వ్యవస్థను అవమానించడమే అంటూ కేసీఆర్ ప్రభుత్వం( KCR ) సుప్రీంకోర్టు తలుపు తట్టింది.దీనిపై విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం పై సీరియస్ అయింది.

నోటీసులు జారీ చేయమంటారా అంటూ ప్రశ్నించింది అయితే గవర్నర్ తరఫున స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రాజ్యాంగబద్ధ పదవి అయినందున నోటీసులు జారీ చేయకండి అంటూ కోర్టును రిక్వెస్ట్ చేశారు.అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు గవర్నర్కు చేరుకున్నాయని వాటి పురోగతిని తెలుసుకొని కోర్టుకి నివేదిస్తానంటూ చెప్పుకొచ్చారు.

Telugu Governor, Supremcourt, Telangana, Ts-Telugu Political News

గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీలో పాస్ అయిన మూడు బిల్లులతో కలుపుకుంటే ఇప్పటివరకు మొత్తం పది బిల్లులను గవర్నర్ కార్యాలయం హోల్డ్ లో ఉంచినట్లుగా తెలుస్తుంది.అందుకే ఇప్పుడు కోర్టు గడప తొక్కిన ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోనూ ఆ బిల్లులను ఆమోదింప చేసుకోవాలని పట్టుదలతో ఉంది.నిజానికి క్యాబినెట్ ఆమోదించిన బిల్లులను ( Cabinet )సవరణ కోసం వెనుకకు పంపవచ్చు తప్ప పూర్తిస్థాయిలో హోల్డ్ చేసే అధికారం గవర్నర్కు లేదు .

Telugu Governor, Supremcourt, Telangana, Ts-Telugu Political News

ఒకసారి వెనుకకు పంపిన బిల్లులను మళ్ళీ ఏ మార్పులు చేయకుండా ప్రబుత్వం గవర్నర్ కి పంపితే వాటిని ఆమోదించడం మినహా గవర్నర్కు మరో మార్గం ఉండదు అందుకే ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే ఉద్దేశంతోనే వెనుకకు పంపించకుండా వాటిని హోల్డ్ చేసి ఉంచుతున్నారని, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అవమానించడమేనంటూ ఇప్పుడు కోర్టులో ప్రభుత్వం వాదిస్తుంది అయితే కోర్టు సీరియస్ అయినందున ఈ విషయంలో కేంద్ర హోం శాఖ కూడా కలగజేసుకొని బిల్లులు పాస్ అయ్యేవిధంగా గవర్నర్కు సూచనలు ఇస్తుందని ఇక కథ సుఖాంతం అవుతుందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube