2024 ఎన్నికల్లో వైసిపి 175 స్థానాల్లోనూ గెలుస్తుందని, గెలిచి తీరాలని జగన్ పదేపదే పార్టీ శ్రేణులకు చెబుతున్నారు.2019 ఎన్నికల్లో 151 సీట్లలో గెలుస్తామని తాము అనుకున్నామా గెలిచాం కదా .గెలిచాక సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేస్తూ, ప్రజల ఆదరణ మరింత చురగున్నాము కాబట్టి కచ్చితంగా 175 స్థానాల్లోనూ మనమే గెలుస్తామంటూ పదే పదే జగన్ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు.చెప్పడమే కాదు రాబోయే ఎన్నికల్లో అది నిజం చేసి చూపించేందుకు ముందుగానే జగన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యేలపై అంతర్గతంగా సర్వేలు నిర్వహించి పని తీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేలకు వార్నింగ్ సైతం ఇచ్చారు.రాబోయే ఎన్నికల్లో తప్పకుండా గెలిచే వరకు టికెట్ కేటాయిస్తామని, పనితీరు సక్రమంగా లేక నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ భరించేందుకు తాము సిద్ధంగా లేమని జగన్ ఇప్పటికే చెప్పేశారు. అయితే ఈ లిస్టులో పార్టీ సీనియర్ నాయకులు ఉండడంతో, కుదిరితే ఎమ్మెల్యే టికెట్ లేదా వారికి ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించి వారిలో అసంతృప్తిని పోగొట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు.దీనిలో భాగంగానే ఎమ్మెల్యేలకు డెడ్ లైన్ జగన్ విధిస్తున్నారు. గెలుపు కోసం గట్టిగా కష్టపడాలని నిరంతరం ప్రజల్లో ఉంటూ, నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని

జగన్ పదే పదే చెబుతున్నారు.ఇప్పటికే 30 మంది కి పైగా వైసీపీ ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్ పీకినట్టు సమాచారం.అంతేకాకుండా టిడిపి నుంచి వైసీపీలో వచ్చి చేరిన వారు కారణంగా అయా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడంతో , ఆ గ్రూపు రాజకీయాలను పూర్తిగా పోగొట్టేందుకు ఎమ్మెల్సీ పదవులను ఆయా వ్యక్తుల పనితీరు ఆధారంగా ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారట.

ఏపీలో త్వరలోనే 21 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతూ ఉండడం, అవన్నీ వైసిపి ఖాతాలోనే పడుతుండడంతో, ఇప్పటికే నియోజకవర్గాలు, సామాజిక వర్గాల వారీగా ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించేందుకు జగన్ లిస్ట్ రెడీ చేస్తున్నారట.2019 ఎన్నికల సమయంలోనే చాలామంది సీనియర్ నాయకులకు వైసీపీ టికెట్ దక్కలేదు .ఆ సమయంలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు.ఆ తరువాత వారిలో చాలామందికి ఆ పదవి దక్కలేదు.ఇ ప్పటికీ వారు ఆ పదవి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.అటువంటి వారికి ఎమ్మెల్సీలుగా ముందుగా అవకాశం కల్పించాలని జగన్ నిర్ణయించుకున్నారట.







