హైదరాబాద్ రాంగోపాల్ పేటలో అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.ఈ ప్రమాదంలో చిక్కుకున్న కొంతమందిని ఫైర్ ఫైటర్స్ రక్షించారని ఆయన చెప్పారు.
ఇంకా భవనంలో ఇద్దరు చిక్కుకున్నారని అనుమానం ఉందన్నమంత్రి తలసాని ఫోన్లు చేసినా రెస్పాండ్ కావడం లేదని తెలిపారు.ఈ క్రమంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.పక్క భవనాలకు ఎలాంటి ప్రమాదం లేదని, మరో రెండు, మూడు గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని స్పష్టం చేశారు.
అయితే ఉదయం 11 గంటల సమయంలో భవనంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సెల్లార్ వన్ లో మొదలైన మంటలు పైకి వ్యాపిస్తున్నాయి.
ఓ వైపు మంటలు తగ్గుతున్నా దట్టమైన పొగ కమ్ముకుంది.దీంతో సహాయక చర్యలకు కొంచెం ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే భవనంలో చిక్కుకున్న ఐదుగురిని ఫైర్ ఫైటర్స్ క్రేన్ సాయంతో రక్షించారు.







