వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.వలంటీర్లు, సచివాలయ కన్వీనర్ల సమావేశంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రోడ్లపై గోతులు కూడా పూడ్చలేకపోతున్నామని అసంతృప్తి వ్యక్తం చేశారు.తాగడానికి నీళ్లు అడిగితే కేంద్ర నిధులు వచ్చే వరకు ఆగమని చెబుతున్నారన్నారు.
కేంద్రం నిధులు ఇస్తే మనం ఏం చేస్తున్నామని ప్రశ్నించారు.ఈ నాలుగేళ్లలో ఏ పని చేశామని ఓట్లు అడుగుతామని తెలిపారు.
గత ప్రభుత్వమూ పెన్షన్లు ఇచ్చిందన్న ఆనం పెన్షన్లు ఇస్తే ఓట్లు పడతాయా అని ప్రశ్నించారు.