తెలుగు దేశం పార్టి నాయకులు ఎమ్మేల్యే ఆళ్ళ రామకృష్ణరెడ్డి అక్రమంగా గ్రావెల్ క్వారి నిర్వహిస్తున్నాడని చేసిన ఆరోపణపై ఎమ్మేల్యే ఆళ్ళ రామకృష్ణరెడ్డి వాఖ్యలను ఖండించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను గ్రావెల్ అక్రమాలకు పాల్పడ్డానని అభాండం వేసే తెదేపా నాయకుల మనసాక్షికి తెలుసు అది వాస్థవమో! కాదో, కేవలం నాపై బురద చల్లాలని ఉద్దేశంతో లోకేష్ బాబు ఆదేశానుసారం వారు అలా మాట్లాడుతున్నారేతప్ప నిజమేమిటో వారికి తెలుసన్నారు.
నేను నియోజకవర్గంలో సుమారు 400-500 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేసాను ఇది వాస్తవం మరి గత ప్రభుత్వంలో మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు , మూడు శాఖల మంత్రి లోకేష్ ఈ ప్రాంతంలోనే ఉంటూ పేదల అభివృద్దికి వారు చేసినది శూన్యమన్నారు.ఈ ప్రాంతంలో ముప్పై సంవత్సరాలనుండి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు మా ప్రాంతాలు బురదమయమై ఉన్నాయంటే వారికి రోడ్లు వేసి మెరుగైన సౌకర్యాలు కల్పించాము.
ఆరోపణ చేసిన తె దే పా నాయకుడు పోతినేని శ్రీనివాసరావు ప్రస్తుతం ఉంటున్న ఇళ్ళు ఉన్న ప్రాంతం మరియు ఆపరిసర ప్రాంతాల వారి నివాస భూమి గత ప్రభుత్వంలోనే కొన్ని పొర పొరపాటు వలన 22-A (నిషేదిత భూమి జాబితా)లో ఉంటి ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో దానిని తొలగించటం ఆయన వల్ల కానిది కూడ.ప్రజాక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న మా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జాబితానుండి విడగొట్టి వారికి మేలు చేసినదని గుర్తుచేసారు అక్రమంక క్వారీలు నిర్వహించవలసిన అవసరం మాకు లేదని తెదేపా నాయకుల ఆరోపణలను ఖండించారు.