రాష్ట్రాల విభజన ప్రక్రియపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.విభజన హామీలు అమలు అయ్యేలా చూడాలని కోరారు.
ఈ మేరకు కేంద్రంతో పాటు తెలంగాణలకు న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వాలని ఉండవల్లి కోరారు.ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విజభన చెల్లదని తాను కూడా కేసు వేశానట్లు చెప్పారు.
ఏపీ ప్రభుత్వం కూడా ఎస్ఎల్పీ వేసిందని తెలిపారు.దీంతో తన కేసుకు మరింత బలం చేకూరిందని వెల్లడించారు.







