కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ( MLC Jeevan Reddy )మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.ఖరీఫ్ కు సాగునీరు అందకపోవడానికి కేసీఆరే( KCR ) కారణమని ఆరోపించారు.
మిషన్ భగీరథ ఫెయిల్యూర్ ప్రాజెక్టు( Mission Bhagiratha Failure project ) అని విమర్శించారు.కమీషన్ల కక్కుర్తితోనే మిషన్ భగీరథ ప్రాజెక్టు తీసుకొచ్చారన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పది ఏళ్లలో చేయలేనివి రేవంత్ రెడ్డి మూడు నెలల్లో చేసి చూపించారని తెలిపారు.
ఈ క్రమంలోనే ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బయటపెట్టడానికి బీజేపీ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు.బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే అన్ని రిజర్వేషన్లు తొలగిస్తారని ఆరోపించారు.
పార్లమెంట్ ఎన్నికల తరువాత బీజేపీ కూడా కనుమరుగవుతుందని తెలిపారు.







