మిస్ చెన్నై బొబ్బిని అయిషా టాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది.నటిగా తన టాలెంట్ చూయించుకునేందుకు ఆమె సిద్ధమవుతోంది.
తమిళ నాడు చెన్నైకి చెందిన బొబ్బిని అయిషా.మిస్ చెన్నై అందాల పోటీలో విన్నర్‌గా నిలిచి మిస్ చెన్నై కిరీటాన్ని సొంతం చేసుకుంది.
నటన, డ్యాన్స్, సింగింగ్ వంటి వాటితో పాటు స్వి్మ్మింగ్, మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యం ఉన్న అయిషా ఇప్పుడు నటిగా తన టాలెంట్ ప్రదర్శించేందుకు సమాయత్తమవుతోంది.ఇప్పటికే మలయాళంలో ఓ అగ్ర నటుడి చిత్రంలో అవకాశం పొందిన అయిషా.
టాలీవుడ్ నుంచి కూడా తనకు అవకాశం వచ్చినట్లుగా తెలిపింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
‘‘నటిగా నన్ను నేను నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను.ప్రస్తుతం మలయాళ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్నాను.
ఆ చిత్ర వివరాలు త్వరలోనే అధికారికంగా బయటికి రానున్నాయి.అలాగే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కూడా పిలుపు వచ్చింది.
తెలుగు భాష అంటే నాకు ఎంతో ఇష్టం.అందుకే తెలుగు సినిమా పరిశ్రమలో నటించేందుకు ఎంతగానో వేచి చూస్తున్నాను.
ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నాను.అందులో మంచి కథని సెలక్ట్ చేసుకుని.
త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించి, వారి ఆశీస్సులు పొందుతాను.’’ అని తెలిపారు.







