నిమ్మకాయ తొక్కలతో అద్భుతాలు.. వీడియో వైరల్..

కొన్ని పనికి రాని వస్తువులను ఉపయోగించి చాలా మంది అద్భుతాలు సృష్టింస్తుంటారు.ఇలాంటి క్రియేటివిటి ఉన్న వారు ఏ వస్తువులను ఊరికే వదిలిపెట్టరు.

వాటిని ఎలా ఉపయోగించాలో ఆలోచిస్తూ తమ క్రియేటివిటీ బయటపెడుతూ ఉంటారు.వీటితో కొత్త కొత్త వస్తువులను సైతం తయారు చేస్తూ ఉంటారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంటాయి.ఇక మేకప్ విషయానికి వస్తే క్రియేటివిటి ఉన్న చాలా మంది ఎవరూ ఊహించని విధంగా కొత్త డిజైన్స్ వేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటారు.

ఇలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.లెమన్ నెయిల్ ఆర్ట్ కు సంబంధించిన వీడియో నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది.

Advertisement

మరి దానిపై మీరు కూడా ఓ లుక్కెయ్యండి.లెమన్ నెయిల్ ఆర్ట్ కు సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో తాగాజా పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో ఓ మహిళ తన గోళ్లను నిమ్మకాయ తొక్కలతో అందంగా అలకరించుకున్నది.నిమ్మకాయ తొక్కలను ముందుగా తన గోర్లపై గమ్‌తో అతికించింది.

తర్వాత వాటిని గోరు షేప్ లో కట్ చేసింది.ఆ తర్వాత దానిపై నుంచి ఓ జెల్ పూసింది.

తర్వాత నిమ్మతొక్క మీద ఉన్న పొరను తీసేసింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

అనంతరం గోరును అందంగా తయారు చేసింది.వీటిపై నెయిల్ పాలిష్ ను పూసింది.అందంగా కనిపించేందుకు చిన్ని చిన్న రాళ్లను సైతం అంటించింది.

Advertisement

ఈ వీడియో నెటిజన్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది.కొందరు మాత్రం నిమ్మ తొక్కలతో ఆర్ట్ చేయడం డేంజన్ అని చెబుతుంటే.

మరి కొందరు మాత్రం ఆమె క్రియేటివిటిని పొగడకుండా ఉండలేకపోతున్నారు.మొత్తానికి కామెంట్స్ మాత్రం భిన్నంగా వస్తున్నాయి.

మరి మీరు కూడా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.

తాజా వార్తలు