పుదీనా టీతో జలుబు, ద‌గ్గుకు చెక్.. మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా!

పుదీనా.దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

ఘాటైన సువాసన క‌లిగే ఉండే పుదీనాను వంట‌ల్లో విరివిగా ఉప‌యోగిస్తుంటారు.

ముఖ్యంగా నాన్ వెజ్ వంట‌ల్లో పుదీనా వేస్తే.

ఆ రుచే వేరుగా ఉంటుంది.ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగి ఉండే పుదీనా.

వంటకు మంచి ఫ్లేవర్ ఇవ్వ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా స‌హాయ‌ప‌డుతుంది.అందులోనూ పుదీనా టీ తాగ‌డం వ‌ల్ల బోలెడ‌న్ని బెనిఫిట్స్ పొందొచ్చ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Advertisement

మ‌రి ఆ బెనిఫిట్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను కంటికి క‌నిపించ‌ని అతి సూక్ష్మ‌జీవి అయిన‌ క‌రోనా వైర‌స్ క‌ల‌వ‌ర పెడుతున్న సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు వ‌ర్షాకాలం కూడా.ఈ స‌మ‌యంలో జ‌లుబు, ద‌గ్గు స‌మ‌స్య‌లు చాలా మందిని వెంటాడుతున్నాయి.

అయితే అలాంటి వారికి పుదీనా టీ  స‌హాయ‌ప‌డుతుంది.జ‌లుబు ద‌గ్గు ఉన్న‌వారు ఒక క‌ప్పు నీటిలో పుదీనా ఆకులు వేసి బాగా మ‌రిగించుకోవాలి.అనంత‌రం ఆ నీటిని వడ‌కట్టి, తేనె క‌లిపి తాగితే.

క్ర‌మంగా జ‌లుబు, ద‌గ్గు త‌గ్గుముఖం ప‌డుతుంది.ప్ర‌తి రోజు ఈ పుదీనా టీ తాగ‌డం వ‌ల్ల‌.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

అందులో ఉండే సి, ఎ విటమిన్లు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌ప‌డేలా చేస్తాయి.క‌డుపు నొప్పి, గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డేవారు ఉద‌యం పుదీనా టీ తాగితే.

Advertisement

మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.అలాగే పుదీనా టీ తాగ‌డం వ‌ల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది.

ఒత్తిడి దూరం అవుతుంది.నిద్ర‌లేమితో బాధ‌ ప‌డేవారికి కూడా పుదీనా టీ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

రోజుకు ఒక క‌ప్పు పుదీనా టీ తీసుకుంటే.నిద్ర‌లేమి స‌మ‌స్య త‌గ్గుతుంది.

నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో చాలా మంది ఇబ్బంది ప‌డుతుంటారు.అలాంటి వారు ప్ర‌తి రోజు పుదీనా టీ తాగితే.

నోటీ దుర్వాస‌న త‌గ్గ‌డంతో పాటు చిగుళ్లకు సంబంధించిన వ్యాధుల‌ను సైతం దూరం చేస్తుంది.

తాజా వార్తలు