దొంగలను అద్దెకి తెచ్చుకుంటున్న 'గ్యాంగ్'లు.. ఎక్కడంటే?

సినిమాల త‌ర‌హాలో క్రైమ్ లు జ‌రిగిన ఘ‌ట‌న‌లు చాల‌నే ఉన్నాయి.కానీ ఇప్పుడు మీరు చ‌దువ‌బోయేది అంత‌కు మించిన స్థాయిలో ఉంటుంది.

నిజ జీవితంలో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయా అనిపిస్తుంది తాజాగా వెలుగు చేసిన ఓ ఘ‌ట‌న గురించి తెలిస్తే.అదే ఢిల్లీ క్రైమ్ క‌థ‌.

Minors From Madhya Pradesh Villages Leased Lakhs By Burglary Gangs, Madhya Prade

ఇచ్చ‌ట అన్ని రిపేర్లు చేయ‌బ‌డును అనే సినిమా డైలాగ్ మాదిరిగా.ఇచ్చ‌ట దొంగ‌ల రిక్రూట్ మెంట్ జరుగును.

ట్రైనింగ్ తో పాటు భారీగా వేత‌నాలు ఇవ్వ‌బ‌డును అని చెబుతోంది ఈ క్రైమ్ క‌థ‌.మైనర్ల‌కు అద్దెకు తీసుకురావ‌డంతో పాటు వారికి దొంగ‌త‌నాలు చేయ‌డంలో శిక్ష‌ణ ఇస్తారు.

Advertisement

అద్దె త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి.సూటుబూటు వేసుకుని.

పంక్ష‌న్లు, పెళ్లిళ్ల‌ను టార్గెట్ పెట్టుకుని అతిథుల్లా అక్క‌డికి చేరుకుని.భారీ న‌గ‌లు, డ‌బ్బుల‌తో ఉడాయిస్తారు.

తాజాగా ఇలాంటి ఘ‌ట‌న ఢిల్లీలో వెగులు చూసింది.ఇందులో ప‌ట్టుప‌డిన వారిలో చాలా మంది మైన‌ర్లు కావ‌డంతో పోలీసులు మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేశారు.

దీంతో విస్తుపోయే.షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

అదేంటంటే.దొంగ‌ల ముఠాలు మైన‌ర్ల‌కు టార్గెట్ చేసి.

Advertisement

వారిని లీజుకు తీసుకుంటున్నారు.వారికి దొంగ‌త‌నం చేయ‌డం నేర్పించి.

క్రైమ్‌ల‌కు పాల్ప‌డుతున్నారు.అతిథుల్లా పెళ్లి, పంక్ష‌న్ల‌కు చేరుకుని.

ఒక్కొక్క‌రు ఒక్కో ప‌నిచేస్తూ.దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్నారు.

ఇక్క‌డ ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మేమంటే.దొంగ‌త‌నాలు చేయ‌డానికి వ‌స్తున్న మైన‌ర్ల‌ను దొంగ‌ల ముఠాకు వారిని లీజుకు ఇస్తున్న వారి సొంత త‌ల్లిదండ్రులే కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.

వారు ఇలా చేయ‌డానికి కార‌ణం దొంగ‌ల ముఠాలు.మైన‌ర్ల‌కు సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు స‌మంగా భారీగా వేత‌నాలు ఇవ్వ‌డ‌మేన‌ని పోలీసుల విచార‌ణలో వెల్ల‌డైంది.ఒక్కొక్క‌రికి నెల‌కు రూ.ల‌క్ష‌కు పైనే చెల్లిస్తున్నార‌ట‌.దీంతో త‌ల్లీ దండ్రులు వారిని దొంగ‌ల ముఠాకు లీజుకు ఇస్తున్నారు.

అద్దెకు వ‌స్తున్న వారిలో ఎక్కువ‌గా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రాజ్‌ఘ‌డ్ ప్రాంత మైన‌ర్లు ఉంటున్నార‌ని పోలీసులు తెలిపారు.ప‌ట్టణాల‌ను, న‌గ‌రాల‌ను టార్గెట్ చేసుకునీ, కొద్దికాలం అక్క‌డే మాకాం వేసి ఈ దొంగ ముఠాలు క్రైమ్స్ కు పాల్ప‌డుతున్నార‌ని వివ‌రించారు.

తాజా వార్తలు