బిడ్డను ప్రసవించిన మైనర్ బాలిక.. వెలుగులోకి వచ్చిన నిజం..

రోజురోజుకూ దారుణాలు ఎక్కువవుతున్నాయి.చదువుకోవాల్సిన యువత తప్పుదారి పడుతుంది.

చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు.

చిన్న వయసులోనే ప్రేమ, పెళ్లి అంటూ తప్పుదోవ పడుతున్నారు.

ఒక మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఒక యువకుడు మోసం చేసిన ఘటన నిజామాబాద్లో చోటుచేసుకుంది.ఒక యువకుడు మైనర్ బాలికను ప్రేమిస్తున్నాని వెంటపడి ఆమెను గర్భవతి చేసాడు.

గర్భవతి అయిందని తెలిసిన ఏవేవో సాకులు చెబుతూ వచ్చాడు.ఆ బాలిక నెలలు నిండి ప్రసవించిన పట్టించుకోలేదు.

Advertisement

చివరకు ఈ విషయం బాలిక బంధువులకు తెలియడంతో ఈ దారుణమైన ఘటన బయటపడింది.బాలిక బంధువులు ఈ విషయం తెలుసుకుని ఆ యువకుడిపై ఫిర్యాదు చేసారు.

నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డి పేటకు చెందిన ఒక యువకుడు అదే మండలంలోని పక్క గ్రామానికి చెందిన బాలికపై కన్నేశాడు.

ఆ మైనర్ బాలికకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు.ఇప్పుడు ఆ బాలిక తన అక్క వద్ద ఉంటుంది.

ఆ యువకుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెతో శారీరక సంభందం పెట్టుకుని గర్భవతిని చేసాడు.ఆ యువకుడు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన విషయం తెలుసుకున్న అక్క కుటుంబ సభ్యులు ఈ విషయంపై నిలదీస్తే పెళ్లి చేసుకుంటానని సాకులు చెబుతూ కాలాన్ని గడిపాడు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి... అందరూ షాక్!

అయితే ఈ లోపు బాలికకు నెలలు నిండి ఒక బిడ్డను ప్రసవించింది.అప్పటి వరకు ఎవ్వరికి తెలియని ఈ విషయం బిడ్డను కనడంతో ఆమె బంధువులకు తెలిసింది.

Advertisement

బంధువులు పోలీసులను కలిసి ఆ యువకుడిపై ఫిర్యాదు చేసారు.మైనర్ బాలికను మోసం చేసి తల్లిని చేసాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసుకున్నారు.

తాజా వార్తలు