దారుణం : రోడ్డుపై ఒంటరిగా ఉన్న బాలికను అపహరించి...

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నప్పటికీ మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు మాత్రం ఆగడం లేదు.

తాజాగా రాత్రి సమయంలో తన తండ్రి కోసం రోడ్డుపై ఒంటరిగా ఎదురుచూస్తున్న బాలికను గుర్తు తెలియని వ్యక్తి అపహరించి ఆమెపై బలవంతంగా అత్యాచారం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణ జిల్లాలోని నూజివీడు ప్రాంతంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఓ యువతి నూజివీడు పరిసర ప్రాంతంలో ఓ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. అయితే నిన్నటి రోజున బాలిక తన వ్యక్తిగత పని నిమిత్తమై బయటకు వచ్చింది.

దీంతో అప్పటికే చీకటి పడడంతో తన తండ్రికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది.దీంతో బాలిక ఒంటరిగా రోడ్డుపై తన తండ్రి కోసం ఎదురుచూస్తుంది.

అయితే  ఇంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. దీంతో బాలిక స్ప్రుహ కోల్పోయింది.

Advertisement

బాలిక మరణించిందని భయపడేనటువంటి నిందితుడు ఆమెను న్యూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీ వెనక వదిలేసి వెళ్లిపోయాడు.

అయితే అటువైపుగా వెళ్తున్నటువంటి కొందరు వ్యక్తులు అపస్మారక స్థితిలో పది ఉన్నటువంటి బాలికను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాలికను దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.అనంతరం బాలిక స్పృహ లోకి రాగానే ఆమె ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు