తెలంగాణ విద్యా సంస్థల పున ప్రారంభం పై మంత్రులు వీడియో కాన్ఫరెన్స్..!!

కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యా సంస్థల తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ మొదటి తారీకు నుండి పున ప్రారంభించాలని ప్రభుత్వం డిసైడ్ అయిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా క్లోజ్ అయిపోవటం తెలిసిందే.

కాగా ప్రస్తుతం చాలా వరకు వైరస్ ప్రభావం తగ్గటంతో.పాటు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం సగానికి సగం కంప్లీట్ కావడంతో.ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలలో విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 16 వ తారీకు నుండి విద్యా సంస్థలు ఓపెన్ అయ్యాయి.

అయితే సెప్టెంబర్ మొదటి తారీకు నుండి స్కూల్స్కాలేజీలు ఓపెన్ అవుతున్న నేపథ్యంలో.తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరికొంత మంది మంత్రులు విద్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Advertisement

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లు, విద్య వైద్య శాఖ అధికారులతో పాట . పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.సెప్టెంబర్ మొదటి తారీకు నుండి విద్యా సంస్థలు ఓపెన్ అవుతున్న నేపథ్యంలో విధివిధానాలపై చర్చలు జరుపుతున్నారు.

ముఖ్యంగా కరోనా నిబంధనలు పాటించేలా.చర్యలు తీసుకోవడానికి ప్రాధాన్యతనిస్తూ చర్చలు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు