విశాఖ: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని… చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పేర్లు వేరు వేరు… కానీ వారిద్దరూ ఒకటే.చంద్రబాబు నాయుడిని గద్దె ఎక్కించాలని పవన్ కళ్యాణ్ తాపత్రయ పడుతున్నారు.
వీరిద్దరు భేటీ ద్వారా ఏదో సాధించినట్టు పవన్ భ్రమ పడుతున్నారు.వీరిద్దరూ కాదు ఎన్ని పార్టీలు కలిసిన వైఎస్ఆర్సిపి వెంటే ప్రజలు ఉన్నారు.
ఇప్పుడేమీ రాష్ట్రంలో ఎమర్జెన్సీ రాలేదు.మంత్రులపై దాడి జరిగితే పవన్ కళ్యాణ్ ని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు వెళ్లారు.
చంద్రబాబు నాయుడు సభలో జనం చనిపోతే చంద్రబాబునాయుడుని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు.సభలో చనిపోయిన మహిళల కుటుంబాలను పరామర్శించడానికి వీరిద్దరు వెళితే బాగుండేది.పవన్ చంద్రబాబు నాయుడు అధికార దాహం కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.జీవో నెంబర్ వన్ తీసుకురావడానికి అసలు కార్యక్రమం చంద్రబాబు నాయుడు.ప్రజల ప్రాణాలు రక్షించడానికి జీవో నంబర్ వన్ తీసుకురావడం జరిగింది.అమాయకపు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా?
.