కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.హైదరాబాద్ రాంగోపాల్ పేటలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం విషయంలో కిషన్ రెడ్డి గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు.
కేంద్రమంత్రి స్థానంలో ఉన్న కిషన్ రెడ్డి బాధ్యతగా మాట్లాడాలని సూచించారు.తెలియకపోతే మాట్లాడవద్దన్న ఆయన నోటికి వచ్చినట్లు ఇంకోసారి మాట్లాడవద్దని చెప్పారు.
కాలిపోయిన భవనంపై నివేదిక తెప్పించుకుంటున్నామని తెలిపారు.అదేవిధంగా అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
హైదరాబాద్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ మద్దతు ఉందని అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని విమర్శించారు.







