ప్రెజెంట్ మాస్ మహారాజా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.వరుసగా రెండు హిట్స్ ను అందుకుని కెరీర్ లోనే పీక్స్ స్టేజ్ లో ఉన్నాడు.
అయితే రవితేజ ముందుగా ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.గత ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ధమాకా సినిమా వచ్చింది.
ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి అందరిని ఆశ్చర్య పరిచింది.
ఇక ఆ వెంటనే సంక్రాంతికి మరో సినిమాతో వచ్చాడు.
రవితేజ మెగాస్టార్ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా వాల్తేరు వీరయ్య.ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఈ సినిమా ఏకంగా 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అందరికి షాక్ ఇస్తుంది.ఇలా వెంటవెంటనే రెండు 100 కోట్ల సినిమాలు రవితేజ కెరీర్ లో రావడంతో ఇప్పుడు ఈయన ఫుల్ ఖుషీగా ఉన్నాడు.

సరైన కథ పడితే రవితేజ బ్లాక్ బస్టర్స్ అందుకోవడం ఖాయం అని ఈ రెండు నిరూపించారు.ఇక ప్రెజెంట్ రవితేజ చేతిలో రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ఉన్నాయి.ఈ రెండు శరవేగంగా షూట్ జరుపు కుంటుండగా ఈయనతో సినిమాలు చేయడానికి మరికొంత మంది డైరెక్టర్లు వేచి చూస్తున్నారు.ముఖ్యంగా ఇద్దరు డైరెక్టర్స్ మాస్ రాజా కోసం వేచి ఉన్నారని టాక్.

వారు ఎవరంటే మాస్ రాజాతో క్రాక్ వంటి హిట్ కొట్టి ఇప్పుడు వీరసింహారెడ్డి సినీరంతో సంక్రాంతికి హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాకు సీక్వెల్ చేయాలని ఎదురు చూస్తున్నాడు.ఇక మరో డైరెక్టర్ ఎవరంటే వాల్తేరు వీరయ్య సినిమాను డైరెక్ట్ చేసిన బాబీ అని తెలుస్తుంది.బాబీ ఇప్పటికే స్టోరీ లైన్ కూడా చెప్పాడని టాక్.మరి ఈ ఇద్దరి డైరెక్టర్లలో రవితేజ ఏ డైరెక్టర్ తో ముందుగా సినిమా చేస్తాడో అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.







