మన భారతదేశం సకల శాస్త్రాలకు నిలయం.అందులో జ్యోతిష్య శాస్త్రం ఒకటి.
ఇందులో ముఖ్యంగా పుట్టిన తేదీ, సమయంపై మనుష్యుల స్థితిగతులను చెబుతూ వుంటారు.గ్రహాల స్థానాలు మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి అని నమ్ముతూ వుంటారు.
అందుకే ఇక్కడ సంప్రదాయంలో పిల్లలు ఏ సమయంలో జన్మించారు, ఏ తేదీ, అనే విషయాలు వంటివి ముఖ్యంగా గుర్తుపెట్టుకొని వుంటారు.వాటి ఆధారంగానే పిల్లలకు పేర్లను నిర్ణయిస్తారు.
ఉదయం, పగలు, రాత్రి వేళ పుట్టే వారి భవిష్యత్తు వివిధ రకాలుగా ఉంటుందని ఈ శాస్త్రం చెబుతోంది.
అర్ధరాత్రి నుండి 2 గంటల మధ్యలో పుట్టిన వారిలో ఆత్మ విశ్వాసం మెండుగా ఉంటుంది.
అలాగే వీరు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు.మీడియా, టీవీ, సినిమా రంగంలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెబుతారు.ఇక ఉదయం 4.00 నుండి 6.00 వరకు పుట్టిన వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు.నాయకత్వ లక్షణాలు మెండుగా ఉండి డిఫెన్స్, పోలీస్ వంటి సర్వీసెస్‌లో రాణిస్తారు.అలాగే ఉదయం 8.00 నుండి 10.00 సమయంలో పుట్టిన వారు నిశ్శబ్దాన్ని ఇష్టపడతారు.ఎక్కువగా స్నేహశీలురై ఉంటారు.
రాజకీయ నాయకులు, పబ్లిక్ స్పీకర్, మీడియా లాంటి రంగాల్లో రాణిస్తారు.

అంతేకాకుండా మధ్యాహ్నం 12.00 నుండి 2.00 సమయంలో జన్మించినవారికి బోధనా నైపుణ్యాలు అధికంగా ఉంటాయి.సృజనాత్మకత, ఆశయం, ప్రయత్నాలతో పాటు విజయం సిద్ధిస్తుంది వీరికి.అలాగే వీరు కోచ్, గైడ్, కౌన్సెలర్ లాగా కూడా రాణించవచ్చు.అయితే 30 ఏళ్లు దాటిన తర్వాతే అదృష్టం వీరికి వరిస్తుంది అని చెప్పాలి.ఇక మధ్యాహ్నం 2.00 గంటల నుండి 4.00 వరకు చూసుకుంటే వీరు జీవితంలో హెచ్చు తగ్గులు చూస్తారు.ఫైనాన్స్, ఫండ్స్, అకౌంటింగ్, బ్యాంకింగ్ మొదలైన వాటిలో బాగా రాణిస్తారు.సాయంత్రం 4.00 గంటల నుండి 6.00 వరకు చూస్తే ఎక్కువగా మృదు స్వభావం కలిగి ఉంటారు.సాయంత్రం 6.00 నుండి 8.00 వరకు తీసుకుంటే వీరు సానుభూతిపరులు.జీవితాన్ని చాలా లైట్ తీసుకుంటారు.
ఇలాంటి వారికి ప్రజలు ఆకర్షితులవుతారు.సమస్యలను అద్భుతంగా పరిష్కరిస్తారు.
కాబట్టి ఇందులో మీరు ఏయే సమయంలో పుట్టారో తెల్సుకొని మసులుకోండి.







