ప్రేమిస్తే సినిమా ద్వారా నటుడు భరత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.అయితే ఈ సినిమా తర్వాత ఈయన తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమై వరుసగా తమిళ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
అయితే చాలా సంవత్సరాల తర్వాత తిరిగి మరోసారి నటుడు భరత్ తెలుగు ప్రేక్షకుల ముందుకు హింట్ అనే సినిమా ద్వారా రాబోతున్నారు.మహేష్ దర్శకత్వంలో వి ఆనంద్ ప్రసాద్ నిర్మించబోతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు కథానాయకుడిగా నటిస్తున్నారు ఇక ఇందులో నటుడు భరత్ కూడా ప్రధాన పాత్రలో నటించబోతున్నారు.

ఈ సినిమా జనవరి 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భరత్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.తనకు తమిళ నేపథ్యం ఉండడంతో తమిళ సినిమాలతో బిజీగా ఉన్నానని అయితే మహేష్ చెప్పిన కథ నచ్చడంతో దాదాపు 12 సంవత్సరాల తర్వాత తెలుగులో నటించే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ఇక హింట్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా కేవలం నాకు, సుదీర్ బాబు, శ్రీకాంత్ చుట్టూ తిరుగుతూ ఉంటుందని ఇందులో తాను ఆర్యన్ దేవ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటించానని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ సినిమాతో తను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతానని ఈయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇక తనకు తెలుగులో పూర్తి ఎంటర్టైన్మెంట్ సినిమాలలో అలాగే రా ఏజెంట్ సినిమాలలో నటించాలని ఉందని తెలిపారు.ప్రస్తుతం తాను అలాంటి కథలు కోసమే ఎదురుచూస్తున్నానని తెలియజేసిన ఈయన తెలుగులో తనకు నటించే అవకాశం వస్తే ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ తో కలిసి నటించే అవకాశం రావాలని,ఆయనతో కలిసి నటించాలని ఉంది అంటూ ఈ సందర్భంగా భరత్ తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.







