భువనేశ్వరికి మంత్రి రోజా సవాల్..

రాజమండ్రి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు.భువనేశ్వరి కోరినట్టుగా నా ఆస్తుల విషయమై సీబీఐచే విచారణకు నేను సిద్ధమేనని, మరి మీరు కూడా సిద్ధమేనా భువనేశ్వరీ అంటూ సవాల్ విసిరారు.

 Minister Roja Challenge To Chandrababu Wife Nara Bhuvaneshwari, Minister Roja, M-TeluguStop.com

గురువారం ఉదయం రాజమండ్రి నగరంలోని శ్రీ మార్కండేయేశ్వర స్వామి ఆలయాన్ని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తో కలిసి సందర్శించారు.స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు చేయించుకున్నారు.

పండితులు వేదాశీస్సులు అందజేశారు.అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

స్కిల్ స్కామ్ లో వందల కోట్లు దోచుకుని సీఐడీ దర్యాప్తులో అడ్డంగా దొరికిపోయి రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు ఉండటాన్ని చూసి భువనేశ్వరి ఏమి మాట్లాడుతున్నారో కూడా తెలియడం మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.

నిజానికి ఒక్క చిన్న స్కామ్ కేసులోనే మూడు వందల కోట్లకు పైగా చంద్రబాబు అడ్డంగా బొక్కేస్తే.

మరి అతని హయాంలో మిగిలిన స్కామ్ లన్నీ బయటకు తీస్తే చంద్రబాబు జీవితాంతం జైల్లో ఉన్నా శిక్ష చాలదన్నారు.ఏ నేరం చేయకపోతే ఇన్ని రోజులు చంద్రబాబు జైలులో ఎందుకున్నాడో ముందు భువనేశ్వరి సమాధానం చెప్పాలన్నారు.

అలాగే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాల్లో కోట్లు ఖర్చుపెట్టి న్యాయవాదులను తీసుకొచ్చినా చంద్రబాబుకు రిలీఫ్ లేదంటే స్కిల్ స్కామ్ లో నేరం చేసినట్లేనని మంత్రి రోజా స్పష్టం చేశారు.టీడీపీ వాళ్ళు అంటున్నట్టు ‘నిజం గెలవాలని’ మేమూ కోరుకుంటున్నామని, నిజం గెలిచి చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి జైలులో ఉండాలనే మేమూ కోరుకుంటున్నామని రోజా అన్నారు.

తన భర్త చంద్రబాబు రోజుకు రెండు మూడు గంటలే పడుకునే వారని భువనేశ్వరి చెబుతున్నారు.

Telugu Cbi Enquiry, Chandrababu, Roja, Bhuvaneshwari, Lokesh-Latest News - Telug

మరి మిగిలిన గంటలన్నీ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనే ఆలోచనలతో పడుకునేవారు కాదన్న విషయం ఆమెకూ తెలుసన్నారు.తన హెరిటేజ్ లో 2 శాతం వాటా అమ్మితే రూ.400 కోట్లు వస్తాయంటున్న భువనేశ్వరి మరి ఈ ఆస్తులను ఎన్నికల అఫిడవిట్ లో చంద్రబాబు ఎందుకు చూపలేదని మంత్రి రోజా ప్రశ్నించారు.‌భువనేశ్వరి నా ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని అడుగుతున్నారని.దానికి నేను సిద్ధమేనన్నారు.1991 లో చిత్ర పరిశ్రమకు వచ్చిన నాటి నుంచి నా ఆదాయం ప్రారంభమైందని, సీబీఐ విచారణకు సిద్ధమేనన్నారు.మరి అదే సమయంలో భువనేశ్వరి కూడా ఆమె ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు.

ఆర్థిక నేరగాడికి సంకెళ్ళు వేస్తే మొత్తం రాష్ట్రానికే సంకెళ్ళు వేసినట్టు భువనేశ్వరి వ్యాఖ్యానించడాన్ని రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారని అన్నారు.చంద్రబాబు అరెస్టు వార్త విని మృతిచెందిన కుటుంబ సభ్యులకు రూ.3 లక్షలు చొప్పున ఇస్తున్నారని ఒక విలేకరి మంత్రి రోజా వద్ద ప్రస్తావించగా.

చంద్రబాబు అరెస్టు అయినది 9న అయితే 4వ తారీఖు సంతకంతో ఎలా చెక్ లిచ్చారని ప్రశ్నించారు.

అంటే చంద్రబాబు అరెస్టు అవుతారని ముందే తెలిసి చెక్కులు సిద్ధం చేశారా అని మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు.చంద్రబాబు అరెస్టుతో టీడీపీ నేతల చిన్న మెదడు పగిలిపోయి వారిష్టానుసారం మాట్లాడుతున్నారని, మొన్న ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు మరణవార్త తట్టుకోలేక అనేక మంది చనిపోయారని అనడాన్ని ఈ సందర్భంగా మంత్రి రోజా గుర్తు చేశారు.

తొలుత ఆలయానికి వచ్చిన మంత్రి రోజా, ఎంపీ భరత్ కు ఆలయ మర్యాదలతో దేవస్థాన పాలకమండలి ఛైర్మన్ దీపు ఆధ్వర్యంలో పండితులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు.వేదాశీస్సులు అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube