తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్( Minister KTR ) బిజీబిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలో తాజాగా తెలంగాణ భవన్ లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి( Khairatabad Constituency ) సంబంధించిన కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో( BRS ) జాయిన్ అవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వారిని కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కేసీఆర్ గెలవకపోతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని తెలిపారు.
రాష్ట్రంలో పుట్టుక నుంచి చివరిదాకా చూసుకునే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్( Hyderabad ) అంతర్జాతీయ స్థాయిలో ఎదిగింది.
హైదరాబాద్ లో ఉంటే అమెరికాలో ఉన్నట్లు ఉందని ఇటీవల రజనీకాంత్ తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధి చూసి బీజేపీ ఎంపీ సన్నీడియోల్( BJP MP Sunny Deol ) ఇల్లు కొనుక్కోవాలి అనిపిస్తుందని అన్నారు.హైదరాబాద్ అభివృద్ధి అందరికీ కనిపిస్తుంది.కానీ విపక్షాలకు కనిపించడం లేదు.
సంపద పెంచాలి… పేదలకు పంచాలి అనేది కేసీఆర్( CM KCR ) సిద్ధాంతం అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.తొమ్మిదిన్నరేళ్ళు అద్భుతంగా పరిపాలన చేసిన కేసీఆర్ నీ ఓడిస్తామని కొంతమంది మాట్లాడుతున్నారు.
ఈ రకంగా మంచిగా పరిపాలన చేసిన నాయకుడికి ప్రజలు ఎందుకు ఓటు వేయకూడదు.అని ప్రజలే ప్రశ్నించాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఎవరో వచ్చి ఏవేవో మాట్లాడుతున్నారు.వాళ్ల మాటలను పట్టించుకోవద్దు.
ఒకవేళ వాళ్ల మాటలను పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్ అభివృద్ధి ఆగమైపోద్ది.మళ్లీ అప్పట్లో కాంగ్రెస్ హయాంలో( Congress ) ఏర్పడిన సమస్యలు పునరావృతం అవుతాయి అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.