చేతులు లేవని అడ్మిషన్ ఇవ్వలేదు.. ఐపీఎస్ లక్ష్యంగా చదువు.. ఈ చిన్నారి టాలెంట్ కు ఫిదా అవ్వాల్సిందే!

మన రియల్ లైఫ్ లో చోటు చేసుకున్న ఎన్నో ఘటనలు మనల్ని కదిలిస్తూ ఉంటాయి.అయితే మనలో చాలామంది వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చిన స్థాయిలో ఇతరుల సమస్యలను తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వబోమనే సంగతి తెలిసిందే.

 Ips Aspirant Adoni Girl Shaik Farida Bhanu Success Story Details, Shaik Farida B-TeluguStop.com

రాయలసీమలోని కర్నూలు జిల్లాలోని ఆదోనికి( Adoni ) చెందిన చిన్నారికి చేతులు లేవనే కారణం చూపుతూ ప్రైవేట్ స్కూల్స్ లో అడ్మిషన్( Private School Admission ) ఇవ్వలేదు.

అయితే ఆ చిన్నారి మాత్రం ఉన్నత చదువులు చదవాలనే ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలలో చదివి( Govt School ) మంచి మార్కులు సాధిస్తోంది.

అంగ వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని భవిష్యత్తులో ఐపీఎస్( IPS ) కావడమే తన లక్ష్యమని ఆ చిన్నారి చెబుతూ ఎంతోమంది ప్రశంసలను అందుకుంటున్నారు.ఈ చిన్నారి పేరు ఫరీదా భాను( Farida Bhanu ) కాగా చేతులు లేకుండా జన్మించిన ఈ చిన్నారి తన ప్రతిభతో విమర్శించిన వాళ్ల నోర్లను మూయించారు.

Telugu Adoni, Farida Bhanu, School, Ips Aspirant, Kurnool, Private School, Shaik

తమ కూతురుకు చేతులు లేవని ఒకప్పుడు బాధ పడిన తల్లీదండ్రులు తమ గౌరవాన్ని మరింత పెంచడం కోసం కూతురు కష్టపడి చదువుతూ రాణిస్తుండటంతో ఫిదా అవుతున్నారు.చేతులు లేకపోయినా ఈ చిన్నారి కొన్ని గేమ్స్ ను అద్భుతంగా ఆడుతూ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు.ఈ చిన్నారికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Adoni, Farida Bhanu, School, Ips Aspirant, Kurnool, Private School, Shaik

సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని షేక్ ఫరీదా భాను ప్రూవ్ చేశారు.రెండు చేతులు లేకుండా పుట్టినా సక్సెస్ కావడానికి( Success ) అది సమస్య కాదని ఫరీదా భాను నిరూపించారు.కుటుంబ సభ్యులు ఈ చిన్నారిని కంటికి రెప్పల చూసుకుంటూ ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నారు.

కాలితోనే నోట్స్ రాస్తున్న ఈ చిన్నారికి భగవంతుడు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.షేక్ ఫరీదా భాను అంతకంతకూ ఎదగాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube